Little Hearts OTT: ఓటీటీలో దూసుకెళ్తున్న 'లిటిల్ హార్ట్స్' ఏకంగా అన్ని మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్..!

సాయి మార్తాండ్ దర్శకత్వంలో వచ్చిన 'లిటిల్ హార్ట్స్' ఓటీటీలో 200 మిలియన్ స్ట్రీమింగ్‌ మినిట్స్‌కు చేరుకుంటూ పెద్ద విజయం సాధిస్తోంది. మౌళి, శివానీ నాగరం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ప్రేమకథా చిత్రం, థియేటర్లలో రూ.40 కోట్లకిపైగా వసూలు చేసింది.

New Update
Little Hearts Ott

Little Hearts Ott

Little Hearts OTT: సాయి మార్తాండ్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ డ్రామా లిటిల్ హార్ట్స్ ఓటీటీ వేదికపై మంచి విజయం సాధిస్తోంది. ఈ సినిమా ఇప్పుడు 200 మిలియన్ స్ట్రీమింగ్‌ మినిట్స్‌కి దగ్గరగా చేరుకుంటోంది.

మౌళి, శివానీ నాగరం హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం, ప్రేక్షకులను తమ క్యారెక్టర్లు, కామెడీ, ఎమోషన్లతో ఆకట్టుకుంటోంది. సింపుల్ గానే, ఎమోషనల్ టచ్ ఉన్న ప్రేమ కథతో అందరినీ మెప్పిస్తోంది.

థియేటర్లలో విడుదలైనప్పుడు కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధించింది. రూ.40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్‌తో బాక్సాఫీస్ దగ్గర తన హవా చూపించింది. ఇప్పుడు అదే విజయాన్ని డిజిటల్ వేదికపై కొనసాగిస్తూ, ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

ఇంత స్ట్రీమింగ్‌ మినిట్స్ వచ్చాయంటే, ప్రజలు ఈ సినిమాను ఎంతగానో ఇష్టపడ్డారని అర్థం అవుతుంది. అలా అని పెద్ద భారీ కథ కాకపోయినా, ప్రేమ, కామెడీ, కుటుంబ విలువలు ఇలా అన్ని మసాలాలతో సమతుల్యంగా ఉండటమే సినిమా విజయానికి కారణమైంది అని తెలుస్తోంది.

Also Read: "మన శంకర వరప్రసాద్ గారు" క్రేజీ అప్‌డేట్.. పండక్కి ఇంక రచ్చ రచ్చే..!

సాయి మార్తాండ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, కథ చెప్పే విధానం, పాత్రల మధ్య ఉన్న సంబంధాలు, ఎమోషనల్ కనెక్ట్ అన్నీ చాలా నేచురల్‌గా ఉండడం ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసింది.

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ఎన్ని సార్లయినా చూడదగిన కంటెంట్‌గా అలరిస్తోంది. ఎలాంటి హంగామా లేకుండా, సరదాగా, ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలిగిన సినిమా కావడం దీని స్పెషాలిటీ.

Also Read: 'దేవర పార్ట్ 1' టీవీ టెలికాస్ట్ రెడీ - పూర్తి వివరాలు ఇవే!

ఇప్పటికే స్ట్రీమింగ్‌ మినిట్స్ పరంగా గట్టిగానే దూసుకెళ్తున్న లిటిల్ హార్ట్స్, ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. కొత్తగా, క్లియర్‌గా, ఎమోషనల్ టచ్ ఉన్న సినిమాలు చూడాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అనే చెప్పాలి.

Advertisment
తాజా కథనాలు