Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. మొన్నటివరకు సెలబ్రెటీస్ వర్సెస్ కామానర్స్ గా కాస్త చప్పగా సాగిన షో.. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీతో హీటెక్కింది. బిగ్ బాస్ 'వైల్డ్ స్ట్రోమ్' పేరుతో ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఇంట్లోకి అడుగుపెట్టారు. వచ్చిన మొదటి రోజే బిగ్ బాస్ ఇంట్లో వైల్డ్ స్ట్రామ్ ఎఫెక్ట్ మొదలైంది. ఈ వారం ఎవరు ఎలిమినేషన్ జోన్ కి వెళ్ళాలి? అనేది వైల్డ్ కార్డ్స్ చేతుత్లోనే ఉంటుందని బాంబ్ పేల్చారు బిగ్ బాస్. బజర్ మోగే వరకు ఏ వైల్డ్ కార్డు చేతిలో చివరి వరకు బాల్ ఉంటుందో.. వాళ్ళు తమ బాల్ ని ఎక్స్ కంటెస్టెంట్స్ లో నుంచి తమ నచ్చిన ఒక కంటెస్టెంట్ అందించి ఇతరులను నామినేట్ చేసే అవకాశం కల్పిస్తారు. నిన్న మొదలైన ఈ నామినేషన్ ప్రక్రియ.. ఈరోజు కూడా కొనసాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో నిఖిల్, రమ్య మోక్ష బాల్ పట్టుకొని.. తనూజ, రాము రాథోడ్ కి ఇచ్చారు. దీంతో తనూజ సుమన్ శెట్టి, రామును నామినేట్ చేయగా.. రాము డెమోన్, రీతూను నామినేట్ చేశాడు.
ఆట మొదలెట్టిన దివ్వెల మాధురి..
నిన్నటి నుంచి ఈ నామినేషన్ రచ్చ కొనసాగుతుండగా.. తాజాగా ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదల చేశారు. ప్రోమో చూస్తుంటే.. దివ్వెల మాధురి ఆట మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. దివ్య విషయంలో భరణి, మాధురికి చిన్న ఆర్గుమెంట్ జరిగినట్లుగా ప్రోమోలో కనిపించింది. హౌజ్ లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్న మీకు దివ్య తప్పా.. ఇంకో ప్రపంచం కనిపించడంలేదు అంటూ వాదించింది. ఆ తర్వాత నామినేషన్ టాస్క్ మొదలవగా.. బాల్ కోసం వైల్డ్ కార్డ్స్ అందరూ పరుగెత్తుతారు. ఇక్కడ దివ్వెల మాధురి ఆ బాల్ ను దక్కించుకొని రీతుకి ఇచ్చింది. ఇక రీతూ తన నామినేషన్ లో భాగంగా మొదట భరణిని నామినేట్ చేసింది.
Also Read: Cinema: రామ్ తో ప్రేమాయణం నిజమేనా? ఇన్ స్టాలో భాగ్య శ్రీ షాకింగ్ నోట్!