/rtv/media/media_files/2025/04/14/86GtqQxuwMCUkrWDqiWd.jpg)
RRB ALP Jobs 2025
రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్ల పరిధిలోని అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా మొత్తం 9,970 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 12న ప్రారంభం అయింది. మే 11 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అని అనుకున్న అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. మూడేళ్ల డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్) అర్హత ఉన్నవారు కూడా అర్హులు. రెండు స్టేజ్‌ల కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ ఉంటుంది. అనంతరం ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే నెలకు రూ.19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు.
RRB రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, భోపాల్, బెంగళూరు, బిలాస్‌పూర్, భువనేశ్వర్, చెన్నై, చండీఘడ్, పట్నా, జమ్ము అండ్ శ్రీనగర్, గువాహటి, మాల్దా, కోల్‌కతా, ముజఫర్‌పూర్, ప్రయాగ్‌రాజ్, ముంబయి, సికింద్రాబాద్, రాంచీ, తిరువనంతపురం, సిలిగురి, గోరఖ్‌పూర్.
Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..
అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య- 9,970.
రీజియన్ల వారీగా ఖాళీలు
అహ్మదాబాద్ - 497 పోస్టులు
అజ్మీర్ - 820 పోస్టులు
ప్రయాగ్‌రాజ్ -588 పోస్టులు
భోపాల్ - 664 పోస్టులు
భువనేశ్వర్ -928 పోస్టులు
బిలాస్‌పూర్ - 568 పోస్టులు
చండీఘడ్ - 433 పోస్టులు
చెన్నై - 362 పోస్టులు
ముజఫర్‌పూర్ - 89 పోస్టులు
Also Read: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!
పట్నా - 33 పోస్టులు
ప్రయాగ్‌రాజ్ - 286 పోస్టులు
రాంచీ - 1,213 పోస్టులు
సికింద్రాబాద్ - 1,500 పోస్టులు
సిలిగురి - 95 పోస్టులు
గువాహటి - 30 పోస్టులు
జమ్ము అండ్ శ్రీనగర్ - 08 పోస్టులు
కోల్‌కతా - 720 పోస్టులు
మాల్దా - 432 పోస్టులు
ముంబయి - 740 పోస్టులు
తిరువనంతపురం - 148 పోస్టులు
గోరఖ్‌పూర్ - 100 పోస్టులు
అర్హత: మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Also Read: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!!
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.04.2025.
దరఖాస్తుకు చివరి తేదీ: 11.05.2025.
jobs | rrb recruitment 2025 | rrb updates | latest-telugu-news | telugu-news