రేవంత్‌పై కోపాన్ని రైతులు వాళ్లపై చూపిస్తున్నారు: హరీష్‌ రావు

వికారాబాద్‌ జిల్లాలో ఫార్మా కంపెనీల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులపై జనం తిరగబడిన ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. రేవంత్‌పై తిరగబడని వర్గం ఏదైనా ఉందా అంటూ విమర్శించారు. రైతులు సీఎంపై ఉన్న కోపాన్ని అధికారులపై చూపిస్తున్నారన్నారు.

author-image
By B Aravind
New Update
harish rev

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. వికారాబాద్ జిల్లా దూద్యాల మండలం లగచర్లలో అధికారులపై స్థానికులు రాళ్లు రువ్వారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ ప్రతిక్ జైన్, ఇతర అధికారులు రాగా వాళ్లపై జగం తిరగబడ్డారు. పిడిగుద్దులు, కర్రలతో చితకబాదారు. కలెక్టర్ సహా ఇతర అధికారులకు చెందిన మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే ఈ ఘటనను మాజీ మంత్రి హరీష్‌ రావు సమర్థించారు. సీఎం రేవంత్‌పై తిరగబడని వర్గం ఏదైనా ఉందా అంటూ విమర్శించారు. 

Also Read: కేటీఆర్‌ ఢిల్లీకి అందుకే వెళ్తున్నారు.. బాంబ్ పేల్చిన మంత్రి పొన్నం

సీఎంపై కోపాన్ని రైతులు వాళ్లపై చూపిస్తున్నారు

''గరీబి హటావో అని ఇందిరా గాంధీ పిలుపునిస్తే.. ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుంచి కిసాన్ హటావో అని రేవంత్‌ రెడ్డి పిలుపునిస్తున్నారు. రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైంది. ఆ రాయి ఈరోజు ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వికారాబాద్ రైతన్నల నెత్తిన పడింది. అందుకే రైతులు ఆయన మీద ఉన్న కోపాన్ని జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారుల మీద చూపుతున్నారు. రేవంత్ చేస్తున్న అసమర్థ పాలనకు ఐఎఎస్‌లు, ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారు.

ఇది కూడా చదవండి: చలికాలంలో తులసితో ఆస్తమాని ఇలా అడ్డుకోండి

ఫార్మా సిటీ కోసం కెసీఆర్ హైద్రాబాద్‌కు దగ్గరగా, కాలుష్యం లేకుండా, జీరో వ్యర్థాలతో 15 వేల ఎకరాలు సేకరించి సిద్దం చేశారు. పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చినా కూడా దాన్ని పక్కన బెట్టి పచ్చటి పొలాల్లో ఫార్మా చిచ్చు పెడుతున్నారు. జహీరాబాద్ న్యాల్కల్ మండలంలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఫార్మసిటీ కోసం సేకరించిన భూమిని తన రియల్ ఎస్టేట్ దందా కోసం వినియోగించే కుట్రతో ఈ సమస్య మొదలైంది. 

Also Read: బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

నీ మీద, నీ పాలన మీద తిరగబడని వర్గం ఏదైనా ఉందా రేవంత్ రెడ్డి?. ఇప్పటికైనా పిచ్చి పనులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని.. పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని'' హరీష్‌ రావు అన్నారు. 

Also Read: ఫామ్ హౌజ్ లో బెంజ్ కారు నడిపిన కేసీఆర్.. వీడియో వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు