కేటీఆర్‌ ఢిల్లీకి అందుకే వెళ్తున్నారు.. బాంబ్ పేల్చిన మంత్రి పొన్నం

ఫార్ములా ఈ-రేసు అక్రమాలకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలు, కేసుల నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్‌ ఢిల్లీకి వెళ్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేటీఆర్ ఒక బాధ్యతగల ప్రజాప్రతినిధిగా పోలీసుల విచారణకు సహకరించాలని సవాలు విసిరారు.

New Update
ponnam 2

Ponnam Prabhakar:

ఫార్ములా ఈ-రేసు అక్రమాలకు సంబంధించి కేటీఆర్‌పై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు, కేసుల నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్‌ ఢిల్లీకి వెళ్తున్నారని విమర్శలు చేశారు. కేటీఆర్ ఒక బాధ్యతగల ప్రజాప్రతినిధిగా పోలీసుల విచారణకు సహకరించాలని తెలిపారు. ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ఈ వ్యాఖ్యలు చేశారు. 

'' కేంద్ర సాయం కోసం ఢిల్లీకి వెళ్దామంటే విపక్షాలు ఎప్పుడూ కూడా రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఢిల్లీకి పరిగెత్తుతున్నారు. అక్కడికి వెళ్లి అమృత్ పథకంపై ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ అంటున్నారు. కారు రేస్‌కు సంబంధించి విచారణ చేసేందుకు గవర్నర్ పర్మిషన్ కోరాం. మేము ఎవర్నీ కూడా జైల్లో పెడతామని అనడం లేదు. తన రక్షణ కోసమే కేంద్రం వద్ద మోకరిల్లేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. అమృత్ పథకంలో అవినీతి జరిగితే కేంద్రానికి ఫిర్యాదు చేయొచ్చు. కానీ మీ మీద జరిగే విచారణ నుంచి తప్పించేందుకే ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణకు సహకరించి.. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి.   

Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. బీఆర్ఎస్ నేతకు నోటీసులు!

నవంబర్ 14 నుంచి ఏడాది పాలన విజయోత్సవాలు నిర్వహిస్తాం. ప్రభుత్వ విజయాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన మంచి పనులన్నీ కూడా ప్రజలకు వివరిస్తాం. రవాణాశాఖకు మరింత గౌరవం పెంచేలా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే రవాణాశాఖ లోగోను విడుదల చేస్తామని'' మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 

ఇదిలాఉండగా గతేడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేస్ ప్రారంభమైంది. దీనికి స్పాన్సర్‌గా గ్రీన్ కో-సిస్టర్ కంపెనీ రూ.150 కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.30 కోట్లు, నోడల్ ఏజెన్సీ అయిన హెచ్ఎండీఏ రూ.20 కోట్లు వీటి నిర్వహణ కోసం ఖర్చు చేశాయి. మొత్తం రూ.200 కోట్ల ఖర్చుతో దీనిని నిర్వహించారు. ఈ ఫార్ములా ఈ-రేసుతో ప్రమోటర్స్ బాగా నష్టపోవడంతో స్పాన్సర్‌గా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ నాలుగు సెషన్లను హైదరాబాద్‌లోనే జరపాలని డీల్ కుదుర్చుకున్నారు.

Also Read: ఫామ్ హౌజ్ లో బెంజ్ కారు నడిపిన కేసీఆర్.. వీడియో వైరల్!

 ఇందులో భాగంగానే సీఎస్, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా అక్టోబర్ 5న రూ.23 కోట్లు చెల్లించారు. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంకో రూ.23 కోట్లు ఇచ్చారు. దానికి రూ.9 కోట్ల టాక్స్‌తో మొత్తం ఫోన్ కాల్‌లోనే రూ.55 కోట్ల సొమ్మును ఎఫ్‌ఈవోకి చెల్లించారు.  ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రూ.55 కోట్ల హెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలకు సంబంధించి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసింది. అలాగే మున్సిపల్ శాఖ ఏసీబీకి కూడా ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగానే అప్పటి సీఎస్ అరవింద్ కుమార్‌పై తాజాగా విచారణ చేయగా.. కేటీఆర్ చెప్తేనే అంతా చేశానని ఆయన చెప్పడంతో కేటీఆర్‌ను విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గవర్నర్‌కి లేఖ రాసింది. 

ఇది కూడా చదవండి: చలికాలంలో తులసితో ఆస్తమాని ఇలా అడ్డుకోండి

ఇది కూడా చదవండి: Kodangal: కలెక్టర్ పై దాడి చేసిన వారికి బిగ్ షాక్.. రంగంలోకి డీజీపీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు