KCR: ఫామ్ హౌజ్ లో బెంజ్ కారు నడిపిన కేసీఆర్.. వీడియో వైరల్!

కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎర్రవెళ్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్ స్వయంగా బెంజ్ కారు నడిపి అలరించారు. పట్లోల్ల కార్తీక్ రెడ్డిని పక్కన కూర్చో బెట్టుకొని తన పంటల గురించి వివరించారు. ఫొటో, వీడియో వైరల్ అవుతున్నాయి.

author-image
By srinivas
New Update
 dfdr

KCR Drive Car: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్.. మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. పార్టీనేతలతో సమావేశాలు నిర్వహించడంతోపాటు ప్రజల సమస్యలపై స్పందిస్తూ అండగా నిలుస్తున్నారు.

కార్తీక్ రెడ్డిని పక్కన కూర్చో బెట్టుకొని..

ఈ క్రమంలోనే ఆదివారం గజ్వేల్‌లోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో పాలకుర్తి నియోజకవర్గం నేతలతో సమావేశమైన కేసీఆర్.. అనంతరం స్వయంగా బెంజ్ కారు నడుపుతూ కనిపించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు పట్లోల్ల కార్తీక్ రెడ్డిని పక్కన కూర్చో బెట్టుకొని కారు నడిపిన కేసీఆర్.. ఫామ్ హౌస్‌లో పండిస్తున్న పంటల గురించి కార్తీక్ రెడ్డికి వివరించినట్లు సన్నిహితులు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: Swiggy- Zomato: త్వరలో స్విగ్గీ, జొమాటాలో కొత్త సేవలు

ఇక కేసీఆర్ కారు నడిపిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. టైగర్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి కేసీఆర్ కారు జోరు ఎవరు డ్డుకోలేరంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడిపిన సంగతి తెలిసిందే. కాగా డాక్టర్ల సూచనతో ఒంటరిగా వ్యాన్‌లో ఫామ్ హౌస్ లో కలియతిరిగారు. 

ఇది కూడా చదవండి: నీవు ఒక దొంగ.. తెలంగాణ నిన్ను మరిచిపోయింది: కేసీఆర్ కు రేవంత్ కౌంటర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు