Supreme Court: బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు ఢిల్లీలో బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ చాలామంది ప్రజలు పండుగ వేళ టపాసులు కాల్చేశారు. దీంతో సుప్రీంకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏ మతమూ కూడా కాలుష్యాన్ని ప్రోత్సహించదని పేర్కొంది. ఇలాంటి చర్యలను అరికట్టాలని ఢిల్లీ పోలీసులకు సూచించింది. By B Aravind 11 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఢిల్లీ: ఢిల్లీలో గాలినాణ్యత పడిపోవడంతో దీపావళి పండగ సందర్భంగా బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. కానీ చాలామంది ప్రజలు పండుగ వేళ టపాసులు కాల్చేశారు. దీంతో ఇప్పటికే కాలుష్య పొరల్లో చిక్కుకున్న రాజధాని నగరం పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏ మతమూ కూడా కాలుష్యాన్ని ప్రోత్సహించదని వ్యాఖ్యానించింది. టపాసుల అమ్మకాలు, వాటిని కాల్చడాన్ని అరికట్టేలా ఢిల్లీ పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది కూడా చూడండి: దారుణం.. టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై.. '' కాలుష్యాన్ని సృష్టించే పనులను ఏ మతం కూడా ప్రోత్సహించదు. ఇలానే బాణాసంచాలు పేలిస్తే.. ఆరోగ్యంగా జీవించేందుకు ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లే అవుతుంది. నవంబర్ 25లోగా వ్యాపార వర్గాలను సంప్రదించి.. బాణసంచాను పూర్తిగా నిషేధించే విషయంపై ఢిల్లీ సర్కార్ ఓ నిర్ణయానికి రావాలి. ఈ నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలి. బాణసంచాలపై నిషేధ అమలు కావట్లేదనే వార్తలు వచ్చాయి. కాలుష్యాన్ని నివారించేందుకు నిషేధమే ముఖ్యమైన చర్యగా భావించాం. ఢిల్లీ పోలీసులు అసలు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?. నిషేధాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వాళ్ల స్థలాలను సీల్ చేయడం వంటి కఠిన చర్యలు అమలుచేయడం అవసరం. 2025 నాటి దీపావళి పండుగకైనా ఇలాంటి పరిస్థితులు జరగకుండా చర్యలు తీసుకోవాలని'' సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది కూడా చూడండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి చలికాలం దృష్టిలో ఉంచుకొని ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా బాణసంచా తయారీ, వాటి విక్రయాలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిషేధం 2025 జనవరి 1 వరకు కూడా అమల్లో ఉంటుంది. బాణసంచాను ఆన్‌లైన్‌లో అమ్మడం, డెలివరీలకు సైతం ఈ నిషేధం వర్తిస్తుందని ప్రభుత్వం సెప్టెంబర్‌లోనే స్పష్టంగా చెప్పింది. కానీ టపాసులు కాల్చడం మాత్రం ఆగలేదు. ప్రతీ ఏడాది శీతాకాలాని ముందు కాలుష్య కొరల్లో చిక్కుకునే ఢిల్లీకి దీపావళి పండుగ ప్రతీ ఏడాది ఓ సవాలుగా మారుతోంది. ఇది కూడా చూడండి: ఈ వారం బాక్స్ ఆఫీస్ పండగ.. సినిమాల లిస్ట్ చూస్తే మతిపోవాల్సిందే ! ఇది కూడా చూడండి: ముదురుతున్న మెగా యుద్ధం.. బన్నీకి వరుణ్‌తేజ్ కౌంటర్‌తో మరోసారి రచ్చ రచ్చ! #national #supreme-court #delhi #crackers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి