/rtv/media/media_files/2025/08/30/brs-leaders-stage-protest-2025-08-30-14-09-49.jpg)
BRS protest
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ రాజకీయాల్లో(Telangana Politics) ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. శనివారం అసెంబ్లీ సమావేశం వాయిదా అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెరుపు ధర్నకు దిగారు. BRS నేత హరీశ్ రావు వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు ఖాళీ యూరియా సంచులతో నిరసన తెలిపారు. కమిషనర్ ఆఫీస్‌లో వినతిపత్రం ఇచ్చి కేటీఆర్, హరీశ్ రావు, కౌశిక్ రెడ్డితోపాటు పలువురు ధర్నాకు దిగారు. వెంటనే ఎరువుల కొరత తీర్చాలంటూ బీఆర్ఎస్ నేతల నినాదాలు చేశారు. అక్కడి నుంచి వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని తరలించారు.
Also Read : మండపం వద్ద పాటలు పెడుతుండగా కరెంట్ షాక్.. నల్గొండలో పెను విషాదం!
BRS Leaders Stage Protest In Front Of The Secretariat
రైతన్నకు కష్టం వస్తే ఆంక్షలు లెక్క చేయం, ఇనుప కంచెలను లెక్క చేయం..
— Harish Rao Thanneeru (@BRSHarish) August 30, 2025
యూరియా రైతుల హక్కు...
అది అందకుండా చేయడం
కాంగ్రెస్, బీజేపీల తప్పు..#CongressFailedTelangana#CongressBetrayedFarmerspic.twitter.com/NwQiloWaKE
తర్వాత హరీశ్ రావు(Harish Rao) తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సెక్రటేరియట్(secretariat) దగ్గరకు వెళ్లారు. ఖాళీ యూరియా బస్తాలతో హరీశ్ రావు.. బారీకేడ్లు దూకారు. మెరుపు వేగంతో BRS నేతలు సచివాలయం మెయిన్ ముందుకు దూసుకెళ్లారు. BRK భవన్ నుంచి హరీశ్, కౌశిక్ రెడ్డి సచివాలయం గేట్లు ఎక్కేందుకు పరిగెత్తుకొచ్చారు. ఖాళీ యూరియా బస్తాలతో సచివాలయం దగ్గర రోడ్ల మీద బీఆర్ఎస్ నేతలు పరుగులు పెట్టారు. రాజకీయాల కోసం రైతులతో ఆడుకోవద్దంటూ స్లోగన్స్‌తో ధర్నా చేశారు. సచివాలయం దగ్గర పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. ధర్నాకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read : వరద మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు.. రూ.558.90 కోట్ల నష్టం
యూరియా కోసం తెలంగాణ సచివాలయం వద్ద బీఆర్ఎస్ మెరుపు ధర్నా.
— BRS TechCell (@BRSTechCell) August 30, 2025
రైతులు నెల రోజుల నుండి యూరియా కోసం తీవ్ర అవస్థలు పడుతుంటే, వారికి కనీసం యూరియా అందించలేని అసమర్థ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సచివాలయం వద్ద ధర్నా చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.… pic.twitter.com/BZk4UIJ1xM