/rtv/media/media_files/2025/02/03/h8JoTBuOJf9vPXETHL8t.webp)
BRS President KCR big plan on MLC elections
MLC Elections: తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నిక ఏదైనా కారు పార్టీదే జోరు ఉండేది. కానీ ఇప్పుడు ఎన్నికలంటే అదే కారు పార్టీ మాత్రం మా వల్ల కాదు బాబోయ్ అనే పరిస్థితికి చేరింది. తాజాగా తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా బీఆర్ఎస్ మాత్రం తమకేమీ తెలియదన్నట్లే వ్యవహరిస్తోంది. కేడర్‌కు కూడా ఈ ఎన్నికల గురించి ఏమి తెలియనట్టుగానే ఉండాలని అధిష్టానం చెబుతోందట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం కాని, ఎవరికైనా మద్దతు ఇవ్వడం కానీ చేయొద్దని ఇప్పటికే సంకేతాలు పంపినట్లు సమాచారం.
బీఆర్ఎస్ మౌనం వేనక ఇదే ప్లాన్..
మరోవైపు మాత్రం ఇప్పటికిప్పుడు కేసీఆర్‌ను సీఎంను చేయడానికి ప్రజలంతా ఉత్సాహంగా ఉన్నారని కేటీఆర్ చెబుతున్నారు. మరీ అలాంటి మూమెంట్‌ను ప్రత్యక్షంగా ఆవిష్కరించడానికి ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్ కు మంచి వేదిక భావించవచ్చు. ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు టీచర్ ఎమ్మెల్సీలను కూడా బీఆర్ఎస్ గెలిపించుకుంది. కానీ ఇప్పుడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీలకూ పోటీ పెట్టలేని పరిస్థితికి చేరుకుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే అది తమకు అనుకూలంగా మలచుకోవడానికి ఈ ఎన్నికలే మంచి మార్గంగా భావించాల్సిన బీఆర్ఎస్ మౌనం వేనక అంతర్యమేంటో తెలియాల్సివుంది.
క్యాడర్ కు నైతికంగా ఎదురు దెబ్బే..
బీఆర్ఎస్ పెద్దలు గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీగా లేరని తెలుస్తోంది. గెలవడం కాదు కదా కనీసం పోటీ ఇవ్వలేకపోతే అత్యంత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన వస్తుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. అందుకే పోటీకి దూరంగా ఉండటం మంచిదనే నిర్ణయానికి వచ్చారట. బీఆర్ఎస్ తన శక్తివంచన లేకుండా పోరాటం చేస్తోంది. సోషల్ మీడియాపై ఎక్కువగా దృష్టి పెట్టినా క్షేత్ర స్థాయిలోనూ రోజూ ఏదో ఓ కార్యక్రమం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఎన్నికల్లో పోటీ చేయలేకపోవడం ఆ పార్టీ క్యాడర్ కు నైతికంగా ఎదురు దెబ్బే అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల కంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఆశావహులు మాత్రం తమకు అవకాశం ఇవ్వాలని నాయకత్వాన్ని కోరినట్లు సమాచారం. కాగా ఈ ఎన్నికలపై కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటాడనేది రాష్ట్రరాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: National Games: జాతీయ క్రీడల్లో భారీ కుంభకోణం.. బంగారు పతకాలు అమ్ముకున్న డైరెక్టర్!