/rtv/media/media_files/2025/02/04/OXJQPJVM31PmzKWxJxK4.jpg)
Lavanya plan to kill Shekhar Bhasha
Shekar bhasha: లావణ్య, మస్తాన్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. వీరి కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న శేఖర్ భాషాను హత్య చేసేందుకు లావణ్య ఫ్రెండ్ ప్లాన్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఇష్యూలో లావణ్యకు అడ్డు వస్తున్న శేఖర్ భాషాను లేపేస్తే లైన్ క్లియర్ అవుతుందని భావించి లావణ్య స్నేహితులు చింటు, పడాల లక్ష్మి కుట్రపన్నినట్లు బయటపడింది. ఈ హత్య ప్లాన్‌కు సంబధించిన ఆడియో RTV చేతికి అందడంతో మరింత ఉత్కంఠ రేపుతోంది.
శేఖర్ భాషా కోసం వెయిటింగ్..
అంతేకాదు లావణ్య బ్రదర్ కార్తీక్ సైతం శేఖర్ భాషా కోసం వెయిట్ చేస్తున్నాడని, పడాల లక్ష్మితోపాటు పలువురిని శేఖర్ భాషా ఇంటి దగ్గర పెట్టి రెక్కీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. శేఖర్ బాషాను కొట్టికొట్టి చంపేద్దామంటూ పడాల లక్ష్మి ప్లాన్ చేయగా.. మరికొందరు యాక్సిడెంట్ చేద్దామని, లేదంటే ఊరేసి చంపుదాంమంటూ సలహాలిచ్చినట్లు సంచలన విషయాలు బయటపడుతున్నాయి.
రహస్యంగా వీడియోలు రికార్డు చేసి..
మరోవైపు మస్తాన్ సాయి కేసు దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రహస్యంగా రికార్డు చేసిన వీడియోలతో మస్తాన్ సాయి గలీజ్ పనులు చేసినట్లు తెలుస్తోంది. సెలబ్రిటీలు, వీఐపీల శృంగార, తదితర వీడియోలను మస్తాన్ పోర్న్ సైట్లకు అమ్ముకున్నట్లు ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. పలు దఫాలుగా పోర్న్ సైట్లకు ఈ వీడియోలు అమ్మిన మస్తాన్.. పోర్న్ హబ్ ద్వారా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సెలబ్రిటీలు, వీవీఐపీల డాటర్స్ వీడియోలు సైతం నీలి చిత్రాల నిర్వాహకులకు భారీ ధరకు అమ్ముకున్నట్లు వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.
ఇది కూడా చదవండి: వందల కోట్ల విలువైన 30 లగ్జరీ కార్లు.. ఎందుకు సీజ్ చేశారో తెలుసా?
ఈ కేసులు హీరో నిఖిల్ పేరు కూడా వినిపిస్తుండగా తాజాగ స్పందిస్తూ తనకు సంబంధం లేదన్నాడు. తన ఫోన్ ఎప్పుడు హ్యాక్ కాలేదని, సోషల్ మీడియాలో పబ్లిష్ అవుతున్న ఫోటోలు ఓ పార్టీలో దిగినవి చెప్పాడు. నా సినిమా సక్సెస్ పార్టీలో లావణ్య, రాజ్ తరుణ్ పాల్గొన్నారు. దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దు. నాపై వచ్చిన రూమర్స్‌పై త్వరలోనే క్లారిటీ ఇస్తానని చెప్పాడు నిఖిల్.
ఇది కూడా చదవండి: Maha Kumbh: రేపే మహా కుంభమేళాకు ప్రధాని మోదీ !.. షెడ్యూల్ ఇదే