/rtv/media/media_files/2025/02/04/60gGpBCRyR78uPK3w0gJ.jpg)
Uttarakhand 38th National Games
National Games: ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో(Uttarakhand 38th National Games) భారీ కుంభకోణం బయటపడింది. గేమ్స్ టెక్నికల్ కండక్ట్ కమిటీ (GTCC)లో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. 10 విభాగాలతోపాటు 16 వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీల్లో అధికారులు ముందుగా నిర్ణయించిన ఫలితాలు ఉన్నట్లు తేలింది. దీంతో 'మ్యాచ్ అండ్ మెడల్ ఫిక్సింగ్' ఆరోపణలకింద తైక్వాండో డైరెక్టర్‌ను కమిటీ తొలగించింది. గేమ్స్ టెక్నికల్ కండక్ట్ కమిటీలో పలువురు అధికారులు బంగారు, వెండి, కాంస్య పతకాలను అమ్ముకున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. బంగారు పతకం రూ.3 లక్షలు, వెండి పతకాన్ని రూ.1లక్షకు విక్రయించారని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గేమ్స్ టెక్నికల్ కండక్ట్ కమిటీ నుంచి ముగ్గురు సభ్యులను తొలగించి ప్రవీణ్ కుమార్ స్థానంలో ఎస్ దినేష్ కుమార్‌ను తైక్వాండో కాంపిటీషన్ డైరెక్టర్‌గా నియమించారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం!
ఇదేంతో దిగ్భ్రాంతికి గురిచేసింది పిటీ ఉష..
ఇక ఈ వివాదంపై స్పందించిన GTCC చైర్‌పర్సన్ సునైనా కుమారి.. ఆటల సమగ్రతను కాపాడటానికి తాము PMC సిఫార్సులను ఆమోదించినట్లు తెలిపారు. ఒక డైరెక్టర్ ఇలా చేయడంపై తామఉ నిజంగా ఆశ్చర్యానికి గురైనట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక IOA ప్రెసిడెంట్ PT ఉష ఈ కుంభకోణాన్ని ఖండించారు. పోటీలు మొదలుకాకుండానే జాతీయ క్రీడల పతకాలను తప్పుదారి పట్టించడం విచారకరం. ఇది ఎంతో దిగ్భ్రాంతికరమైనదని అన్నారు. ఇక ఉత్తరాఖండ్‌లోని 8 జిల్లాల్లోని 11 నగరాల్లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఈ పోటీలు జరుగనున్నాయి. 36 రాష్ట్రాలతోపాటు ఒక కేంద్రపాలిత ప్రాంతం జాతీయ క్రీడలలో పాల్గొంటాయి. 17 రోజుల పాటు 35 క్రీడా విభాగాలకు ఈ పోటీలు జరుగనుండగా వీటిలో 33 క్రీడలకు పతకాలు ప్రదానం చేయనున్నారు.
సత్తా చాటిన తెలుగమ్మాయి సురభి..
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జాతీయ క్రీడలను తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ జాతీయ క్రీడలలో యోగా, మల్లఖంబ్‌లను మొదటిసారిగా చేర్చారు. దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా అథ్లెట్లు ఈ ఈవెంట్ లో పాల్గొనున్నారు. ఇప్పటికే 16,000 మందికిపైగా దేశం నలుమూలనుంచి ఆటగాళ్లు, కోచ్‌లు, అధికారులతో కూడిన జట్లు ఉత్తరాఖండ్ చేరుకున్నాయి. మైదానాలన్నీ క్రికెట్ తదితర క్రీడలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. మొత్తం 9వేల మంది జాతీయ స్థాయి క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకోనున్నారు. ఇక తెలంగాణ అమ్మాయి షూటర్ సురభి భరద్వాజ్ సత్తాచాటింది. సోమవారం జరిగిన 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో కాంస్య పతకం గెలిచింది. ఫైనల్‌లో 448.8 స్కోరుతో సురభి 3వ స్థానంలో నిలిచింది.
ఇది కూడా చదవండి: నడిరోడ్డు మీద బాయ్ ఫ్రెండ్ కోసం.. ఇద్దరు అమ్మాయిలు ఎలా కొట్టుకున్నారో చూడండి
ఇది కూడా చదవండి: కేసీఆర్ కు ప్రధాని మోదీ లేఖ.. ఎందుకో తెలుసా?