KCR: డైరీలో రాసిపెట్టుకోండి.. వందశాతం మళ్లీ అదే జరుగుతుంది!

కాంగ్రెస్ అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ అన్నారు. ఏడాదిన్నర పాలనలోనే రాష్ట్రాన్ని 2014 కంటే దారుణంగా తయారు చేశారని మండిపడ్డారు. డైరీలో రాసిపెట్టుకోండి రాబోయేది తమ ప్రభుత్వమే అన్నారు.

New Update

KCR: కాంగ్రెస్ అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ అన్నారు. ఏడాదిన్నర పాలనలోనే 2014 కంటే దారుణంగా తయారు చేశారని మండిపడ్డారు. డైరీలో రాసిపెట్టుకోండి రాబోయేది తమ ప్రభుత్వమే అన్నారు. ప్రసంగం మొదట పహల్గాం ఘటనపై స్పందించిన కేసీఆర్.. పార్టీ శ్రేణులతో పాటు రెండు నిమిషాలు మౌనం పాటించారు. 

Also Read: భారీ పేలుడు.. 25 మంది స్పాట్ డెడ్ -1,139 మందికి తీవ్ర గాయాలు

ఎన్నో అవమానాలు ఎదుర్కొని.. 

ఈ మేరకు 25ఏళ్లుగా తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొని బీఆర్ఎస్ ను బలమైన పార్టీగా నిలబెట్టానన్నారు. ఒక్కడిగా మొదలై కోట్ల సైన్యం నిర్మించానన్నారు. తాము ఎన్నడు పదవుల కోసం పాకులాడలేదని, పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ పేరెత్తితే తొక్కిపెట్టినట్లు గుర్తు చేశారు. జయశంకర్ సార్ తో కలిసి అనేక రూపాల్లో భయంకరమైన పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిపెట్టాం. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ కోసం పదవులు త్యాగం చేశారు. వందలమంది ప్రాణ త్యాగాలతో గులాబీ జెండా నిలబడిందన్నారు. 

కడుపులో పెట్టుకుని చూసుకున్నా..

దేశంలో ఎక్కడాలేని విధంగా తన ప్రభుత్వం హాయాంలోనే రైతు బంధు పథకాన్ని అమలు చేశామని చెప్పారు. రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చినమని చెప్పారు. తెలంగాణ వస్తే కారు చీకటే అన్నారు. వాళ్ల నోళ్లు మూయించేలాగా నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చినం. రైతులు చనిపోతే రైతు భీమా అందించినం. కడుపులు సల్ల కదలకుండా రైతు బంధు పథకాన్ని అమలు చేసుకున్నాం. వందలకోట్ల రూపాయల నష్టం వచ్చిన ధాన్యం కొన్నం. వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేసినం. 40 కోట్ల ఐటీని 2 లక్షల ఆదాయానికి పెంచినం. బీఆర్ఎస్ టైమ్ లో మత కల్లోలం లేదు. ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకుని చూసుకున్నామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశామని చెప్పారు. పాలమూరు జిల్లాలో నీటి కరువు తీర్చామన్నారు. మూడెండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టుకున్నామన్నారు. పడావు భూములన్నీ పచ్చగా మార్చుకున్నామని, పంజాబ్ ను తలదన్నే పంటలు పండేలా తీర్చిదిద్దామమని కేసీఆర్ చెప్పారు.

Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు

 ఏం మాయరోగమొచ్చే..

ఇక తెలంగాణకు నెం1 విలన్ కాంగ్రెస్ పార్టీనే అన్నారు. తెలంగాణ బిడ్డలను ఇందిరా ప్రభుత్వం కాల్చి చంపిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చి యేడాదిన్నర అయింది. మరి ఏం రోగమొచ్చే, ఏ గత్తరొచ్చే. గోల్ మాల్ చేసుట్ల కాంగ్రెస్ నెంబర్ వన్. రైతు బంధు 15 వేలు ఇస్తామని ఇచ్చిండ్రా? ఫించన్ 4 వేలు ఇచ్చిండ్రా? అంతా మోసం. కాంగ్రెస్ చెప్పింది ఏమైనా చేసిందా? అని ప్రశ్నించారు. చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు కొన్నిచ్చిండ్రా? ఎన్ని మాటలు చెప్పిండ్రు. రెండు లక్షల లోన్ అన్నారు ఇంచ్చిండ్రా? వడ్లకు కనీసం మద్ధతు ధర కూడా ఇవ్వట్లేదు. క్వింటాల్ 500 బోనస్ ఇవ్వలేదు. 420 హామీలు చెప్పిండ్రు. వాళ్ల నోటికి మోక్కాలే. కేసీఆర్ లక్ష కాదు మేము తులం బంగారం ఇస్తామని మాట తప్పారని చెప్పారు. రుణమాఫీ కూడా చేయలేదని ఫైర్ అయ్యారు.

రియల్ ఎస్టేట్ పడిపోయింది..

నా కాలు ఇరిగింది. కుంటుకుంట మెంటుకుంటా నేనే బయటకొచ్చి ప్రజల తరఫున కొట్లాడిన. ఇక ఎవరికి నోరు ఉంటే వాళ్లదే రాజ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ను నమ్మి గల్లంతు అయినం. తెలంగాణను బొందల పడగొట్టిర్రు. దీపావళి, సంక్రాతి, మార్చి అనుకుంటూ నాశనం చేశారు. ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది. అవగాహన లేక పరిపాలన చేయరాక రాష్ట్రాన్ని ఆగం చేస్తుండ్రు. నా మనసుకు బాధైతంది. దుఃఖం వస్తోంది. భూములు ధరలు పడిపోయాయి. రియల్ ఎస్టేట్ పడిపోయిందని మండిపడ్డారు. ప్రజలను గోస పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు

నెం 1 రాష్ట్రాన్ని 15వ స్థాయికి..

ఇక 15 రోజులు గడిచినా వడ్లు కొనట్లేదన్నారు. 2014 కంటే ముందు ఎలా ఉండేదో దానికంటే దారుణమైంది. పేదలకు గుడిసెలు వేసుకోమని జాగలు ఇస్తే హైడ్రా పేరుతో వాటిని కూల్చేస్తున్నారు. దేశంలో నెం 1 రాష్ట్రాన్ని 15వ స్థాయికి పడగొట్టారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజలు, మేధావులు ఆలోచన చేయాలన్నారు. పరిష్కారం వెతకాలని సూచించారు. ముళ్లును ముళ్లుతోనే తీయాలని, పోయినకాడగనే దొరకపట్టుకోవాలన్నారు. ఇక ప్రభుత్వ ఆదాయం కోసం భూములు అమ్మితే తప్పేంకాదు.. కానీ యూనివర్సిటీ భూములు అమ్ముతారా? అని ప్రశ్నించారు. ఏ భూములు అమ్మాలనే సోయి లేదా అని అడిగారు. 

కేసీఆర్ కిట్‌ ఖతం..

పేదలకోసం తీసుకొచ్చిన కేసీఆర్ కిట్ పథకం ఆగిపోయిందన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సభ పెట్టుకుంటే బస్సులు రాకుండా చేశారని. కావాలని ట్రాఫిక్ జామ్ చేయించారని అన్నారు. లారీలు అడ్డంపెట్టారని ఆరోపించారు. కేసీఆర్ సభలను ఆపగలరా? ఎవడు ఆపుతడు? అడిగే హక్కును కాలరాస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రశ్నింస్తుంటే వారిపై కేసులు పెడుతున్నారు. పోలీసు సోదరులారా.. మీకు ఒక్కటి చెబుతున్నా. ఈ రాత్రి మీ డైరీల్లో రాసిపెట్టుకోండి. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఎవడు ఆపలేడు.. ఎవడి తరం కాదు. పోలీసులు చదువుకోలేదా? మీకు విజ్ఞానం ఉంది కదా? మీరెందుకు కేసులు పెడుతున్నారు. మీకు రాజకీయాలెందుకు. మీ డ్యూటీ మీరు చేయండి. బీఆర్ఎస్ కు లీగల్ సెల్ ఉంది. కార్యకర్తలకు కేసీఆర్ అండగా ఉంటాడు. న్యాయస్థానం ఉంది. ఎవరు భయపడొద్దంటూ అండగా నిలిచారు.

సంక్షేమంలో ఫెయిల్..

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందన్నారు. రైతు బంధు, రుణ మాఫీ, ధాన్యం కొనుగోలు, ఫించన్, కరెంట్, సంక్షేమ పథకాలు, నీరు, ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని విమర్శించారు. మరో మూడెళ్లతో ఎంత నష్టం తెస్తారోనని భయంగా ఉందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. 

Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!

telangana-news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu

Advertisment