/rtv/media/media_files/2025/04/27/YTOKM7iGTdUyeEHgkS0f.jpg)
NIA takes Pahalgam terror attack Probe
పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై భారత భద్రతా బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసుల బృందాలు కలిసి సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. అయితే తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కేసును ఇప్పుడు జమ్మూకశ్మీర్ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తీసుకుంది. ఈ క్రమంలోనే ఎన్‌ఐఏ బృందాలు పహల్గాంలో దర్యా్ప్తు ప్రారంభించాయి.
Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!
Pahalgam Terror Attack - NIA
అయితే ఈ ఘటన జరిగినప్పుడు ఉగ్రవాదులను చూసిన పర్యాటకులను పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఉగ్రవాద నిరోధక సంస్థకు చెందిన పోలీసు సూపరింటెండెంట్ పర్యవేక్షణలో విచారణ జరుపుతున్నట్లు NIA అధికారులు తెలిపారు. అక్కడ వాళ్లు తీసుకున్న ఫొటోలు, వీడియోలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే పర్యటన సమయంలో ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అడిగారు. మరోవైపు పహల్గాంలోకి ప్రవేశ, నిష్క్రమించే ప్రాంతాల్లో ఫోరెన్సిక్ టీం సాయంతో తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని తెలిపారు.
Also Read: ఇంటి దొంగలే దేశ ద్రోహులు.. ఉగ్రవాదులకు 15 మంది కశ్మీరీలు సహాయం!
ఇదిలాఉండగా ఏప్రిల్ 22న బైసరన్ ప్రాంతాల్లోకి చొరబడిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. చివరికీ సమాచారం మేరకు ముందుగా సీఆర్‌పీఎఫ్ క్విక్ యాక్షన్ టీమ్ స్పందించింది. 25 మంది కమాండోలతో కూడిన టీమ్ దాదాపు 45 నిమిషాల పాట ట్రెక్కింగ్ చేసి ఘటనాస్థలానికి చేరుకుంది. ఆ తర్వాత పర్యాటకులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Also Read: అరేబియా మహాసముద్రంలో యాంటీ షిప్ మిసైల్స్ ప్రయోగం సక్సెస్!
Also Read : విటమిన్ బి12 లోపం వల్ల ఈ తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త!
telugu-news | rtv-news | national-news