Kalvakuntla Kavitha : ఈటలకు మొండిచేయి..కవితను కలిసిన బీజేపీ నేతలు

రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఆ పార్టీలో చిచ్చురేపుతోంది. అధ్యక్ష పదవి బీసీ నేతలకు కాకుండా రామచందర్‌ రావుకు కేటాయించడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అదే బాటలో మరికొందరున్నారు.

New Update
Kavitha

Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha :  తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఆ పార్టీలో చిచ్చురేపుతోంది. అధ్యక్ష పదవి బీసీ నేతలకు కాకుండా రామచందర్‌ రావుకు కేటాయించడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పార్టీ పదవి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ కు వస్తుందని అందరూ ఊహించారు. ఆయనతో పాటు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ పేర్లు కూడా వినిపించాయి. కానీ అనుహ్యంగా పార్టీ అధిష్టానం రామచందర్‌ రావును ఎంపిక చేసి అందరికీ షాక్‌ ఇచ్చింది.

Also read :  Akash Deep Sister: క్యాన్సర్‌ విషయం చెప్తాడని అనుకోలేదు.. ఆకాశ్‌దీప్ సోదరి ఎమోషనల్

రామచందర్ రావు నియామకం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ దశలో ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు కూడా అదే దారిలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకపోవడాన్ని నిరిసిస్తూ పలువురు బీజేపీ కీలక నేతలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయంశగా మారింది. మేడ్చల్ కు చెందిన సీనియర్‌ బీజేపీ నేత రామిడి వెంకట్ రెడ్డి కవితతో భేటీ అయ్యి షాక్‌ ఇచ్చారు.

Also Read:  ఆకాష్ దెబ్బ...ఇంగ్లాండ్ అబ్బా :  రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ!

అల్వాల్ కు చెందిన రామిడి వెంకట్ రెడ్డి మొదటి నుంచి ఈటల రాజేందర్‌ వర్గంగా ఉన్నారు. ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి రావాలని ఆయన బలంగా ఆశించారు. ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని పలు సందర్భాల్లో రామిడి వెంకట్ రెడ్డి అభిప్రాయపడుతూ వచ్చారు. కానీ అధిష్టానం మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకోవడంతో పలువురు అసంతృప్తికి గురయ్యారు. ఈ దశలోనే రామిడి వెంకట్ రెడ్డి కూడా బీజేపీకి రాజీనామా చేసి జాగృతిలో చేరేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆయన గత రెండు రోజులుగా కవితతో చర్చలు జరుపుతున్నారు. రామిడి వెంకట్ రెడ్డి తో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా జాగృతిలో చేరనున్నట్లు తెలుస్తోంది.

Also Read:చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..

#eetala-rajendar #kalvakuntla-kavitha #brs-mlc-kalvakuntla-kavitha #bjp-telangana #bjp-ledars #BJP Telangana Chief #BJP Telangana Chief News #bjp Raja Singh #bjp telangana president ramachandra rao
Advertisment
Advertisment
తాజా కథనాలు