Akash Deep Sister: క్యాన్సర్‌ విషయం చెప్తాడని అనుకోలేదు.. ఆకాశ్‌దీప్ సోదరి ఎమోషనల్

తన అక్క క్యాన్సర్‌తో పోరాడుతుందని ఆకాష్ దీప్ ప్రకటించడంతో ఆమె స్పందించారు. ‘‘ఆకాష్ నా ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతాడని నేను అస్సలు ఊహించలేదు. మేము దీన్ని బహిరంగంగా చర్చించడానికి సిద్ధంగా లేము. ఆకాష్ నాకోసం భావోద్వేగానికి గురై ఇలా అంకితం చేశాడు.’’

New Update
Akhand Jyoti Singh speaks after brother akash deep dedicates 2nd Test win to her

టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ ఇంగ్లాండ్‌తో జరిగిన ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 10 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఈ చారిత్రక విజయాన్ని తన అక్క అఖండ్ జ్యోతి సింగ్‌కు అంకితం ఇస్తున్నట్లు ఆకాష్ దీప్ భావోద్వేగంతో ప్రకటించాడు. తన అక్క స్టేజ్ 3 క్యాన్సర్‌తో పోరాడుతుందని.. తన అక్కకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నానని చెప్పడంతో.. అతడి ప్రకటన అందరి హృదయాలను కదిలించింది. 

Also Read:APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో

Akash Deep Sister

ఆకాష్ దీప్ అక్క జ్యోతి సింగ్ తన తమ్ముడి ప్రకటనపై భావోద్వేగంతో స్పందించారు. ‘‘ఆకాష్ నా ఆరోగ్య పరిస్థితి గురించి ఇంత పెద్ద వేదికపై చెబుతాడని నేను అస్సలు ఊహించలేదు. మేము దీన్ని బహిరంగంగా చర్చించడానికి సిద్ధంగా లేము. తమ్ముడు ఆకాష్ నాకోసం భావోద్వేగానికి గురై ఇలా అంకితం చేశాడు.మా కుటుంబంపై, నాపై అతనికి ఎంత ప్రేమ ఉందో ఇది చూపిస్తుంది’’ అని జ్యోతి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

Also Read:  ఆకాష్ దెబ్బ...ఇంగ్లాండ్ అబ్బా :  రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ!

కాగా ఆమె ఇంకా మాట్లాడుతూ.. రెండు నెలల క్రితం తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఐపీఎల్ సమయంలోనే తన చికిత్స ప్రారంభమైందని ఆమె తెలిపారు. ఆకాష్ దీప్ ఎంత బిజీగా ఉన్నా, మ్యాచ్‌లకు ముందు లేదా తర్వాత ఆసుపత్రికి వచ్చి తనను పరామర్శించేవాడని జ్యోతి చెప్పారు.

ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరే ముందు ఆకాష్‌ను ఎయిర్‌పోర్టులో కలిసి, దేశం కోసం బాగా ఆడాలని, తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని చెప్పానని జ్యోతి గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తాను క్యాన్సర్ మూడో దశలో ఉన్నానని, మరో ఆరు నెలలు చికిత్స కొనసాగుతుందని వైద్యులు చెప్పినట్లు తెలిపారు. 

Also Read:చిన్న సీన్.. కులం వివాదంలో దర్శకుడు సందీప్..

భారత్ విజయం సాధించిన తర్వాత ఆకాష్‌తో వీడియో కాల్‌లో మాట్లాడినప్పుడు.. ‘‘నువ్వు చింతించకు, దేశమంతా మనకు తోడుగా ఉంది’’ అని ఆకాష్ చెప్పినట్లు జ్యోతి తెలిపారు. తమ తండ్రి, పెద్దన్నయ్య మరణం తర్వాత కుటుంబానికి ఆకాష్ పెద్ద దిక్కుగా నిలబడ్డాడని, ప్రతి విషయాన్ని కుటుంబంతో పంచుకునే అరుదైన సోదరుడని ఆమె ప్రశంసించారు. ఆకాష్ తిరిగి వచ్చిన తర్వాత అతనికి ఇష్టమైన పెరుగు వడ, ఆకుకూరలు వంటి వంటలు వండి పెడతానని జ్యోతి చెప్పారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు