BIG BREAKING: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఆ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన కవిత!

ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ తటస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి గెలవాలని‌ కవిత ఆకాంక్షించారు.

New Update
Kavitha

Kavitha

BIG BREAKING:  ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ తటస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేయకుండా ఓటింగ్‌ కు దూరం ఉండాలని నిర్ణయించుకుంది. అయితే అందుకు భిన్నంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి గెలవాలని‌ కవిత ఆకాంక్షించారు. అనేక ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపిన అభ్యర్థి గెలవాలని కోరుకోవడం సానుకూల ప్రాంతీయ వాదం అవుతుందన్నారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డకు అవకాశం వచ్చిందని, సుదర్శన్ రెడ్డి గెలిస్తే వైస్ ప్రెసిడెంట్ పదవికి వన్నెతెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యాంగం పట్ల జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అంకితబావం ఉందని అభిప్రాయపడ్డారు. సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ జాగృతి కృషి చేస్తుందన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల్లో మాట్లాడిన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: అదే జరిగితే..సగం సుంకాలను తిరిగి చెల్లిస్తాం..అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్

సాధించుకున్న భౌగోళిక తెలంగాణలో సామాజిక తెలంగాణ సాధించే వరకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు విశ్రమించరని చెప్పారు. అన్ని వర్గాలకు అవకాశం, స్వేచ్ఛ, సంపద వచ్చేలా తెలంగాణ జాగృతి కృషి చేస్తామన్నారు.ఉన్నతమై‌న లక్ష్యంతో ముందుకు వస్తామన్న కవిత అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు జాగృతి కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ సాధన కోసం బొంత పురుగును సైతం ముద్దాడుతానన్న కేసీఆర్ స్పూర్తితో ముందుకు పోతామని కవిత స్పష్టం చేశారు. లెఫ్ట్ టు రైట్ అందర్నీ కులుపుకుని ముందుకు వెళతామన్నారు.కేసీఆర్ మూడోసారి వచ్చుంటే సామాజిక తెలంగాణ కోసం కృషి చేసేవారన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని రాజకీయంగా ముందుకు వెళతామని తెలిపారు. కేసీఆర్ హయాంలో చేయకుండా మిలిగిపోయిన పనులను ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశంలో అందరి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. సామాజిక తెలంగాణ ఎజెండాను తెలంగాణ జాగృతి తీసుకుంటుందన్నారు. ఇవాళ కవికి మరణం ఉండదని కవి మరణిస్తే ధృవతారగా అనంతకాలంగా వెలుగొందుతారన్నారు.

Also Read: నవారో నోటికి హద్దే లేకుండా పోతోంది..భారత్ కు మంచి ముగింపు లేదంటూ మరోసారి..

కాళేశ్వరంలో భాగమైన మల్లన్నసాగర్ నుంచే హైదరాబాద్ కు తాగునీటి కోసం రేవంత్ శంకుస్థాపన చేశారన్నారు.15వందల కోట్లు ప్రాజక్టును 7వేల 500కోట్లకు పెంచారన్నారు.తెలంగాణ ప్రజల సొమ్ము మెగా కృష్ణారెడ్డికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. కుంభకోణంలో భాగంగానే ప్రాజక్ట్ అంచనాలు పెంచారని తెలిపారు.గోదావరి ఫేజ్-2,3 పనులలో అంచనాలు పెంచడం ద్వారా మెఘా కృష్ణారెడ్డి మరిన్ని మేడలు కట్టుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని కవిత విమర్శించారు. ఇది రేవంత్ రెడ్డి ఇంటి సొమ్ము కాదని రాష్ట్ర ప్రజల సొమ్ము అన్నారు. అంచనాలు ఎందుకు పెరిగాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read:  గాజా ఖాళీ చేసి వెళ్లిపోండి.. స్థానికులకు ఇజ్రాయెల్ సంచలన వార్నింగ్

Advertisment
తాజా కథనాలు