/rtv/media/media_files/2025/09/09/scott-2025-09-09-09-02-13.jpg)
Scott Bessent
టారీఫ్ లతో అన్ని దేశాల మీద ఆధిక్యాన్ని సంపాదిద్దామనుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు యూఎస్ ఫెడరల్ కోర్టు షాకి ఇచ్చింది. సుంకాలను అమలు చేయకూడదని ఆర్డర్లు పాస్ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ట్రంప్ తన అధికారాలకు మించి సుంకాలను విధించారని చెప్పింది. దీంతో పాటూ అమెరికాలో చాలా మంది దగ్గర నుంచీ ఈ టారిఫ్ లపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యూఎస్ సుప్రీంకోర్టులో టారీఫ్ ల మీద కేసు నడుస్తోంది. ఇందులో కోర్టు సుంకాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లయితే..అమెరికా రాబేట్లు తిరిగి చెల్లిస్తుందని స్కాట్ అన్నారు.
అలా అయితే మాకు చాలా ఇబ్బంది..
మీట్ ది ప్రెస్ లో ఎన్బీసీ న్య్ తో వాణిజయ మంత్రి బెసెట్ మస్కాట్ మాట్లాడారు. అధ్యక్షుడు ట్రంప్ విధంచిన సుంకాలను సుపరీంకోర్టు రద్దు చేస్తే మేము దాదాపు సగం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని స్కాట్ చెప్పారు. ఇదే కనుక జరిగితే అమెరికా ఖజానా లోటలో పడిపోతుంది. దేశానికి చాలా ఇబ్బంది. కానీ కోర్టే అలా చెబితే ఏం చేస్తాం..కచ్చితంగా చేయాల్సిందేగా అంటూ స్కాట్ చెప్పారు. సుంకాల విషయంలో వెనక్కి తగ్గితే...అ్యక్షుడు ట్రంప్ చర్చల స్థానాన్ని తగ్గిస్తాయని ఆయన అన్నారు. అయితే అంతకుముందు అమెరికా నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హసెట్ సీబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో .. టారిఫ్‌లపై సుప్రీంకోర్టులో ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ఇతర న్యాయపరమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.
మరోవైపు సుప్రీంకోర్టులో టారిఫ్ ల మీద తీర్పు ఆలస్యం అయ్యేలా ట్రంప్ యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. జూన్ 2026 వరకు దీనిని డ్రాగ్ చేస్తే..750 బిలియన్ డాలర్ల నుంచి ఒక ట్రిలియన్ డాలర్ల వరకు సుంకాలు వసూలు చేయవచ్చని భావిస్తోంది. అలా కాకుండా ముందే కోర్టు వాటిని రద్దు చేస్తే మాత్ర తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని..ట్రప్ యంత్రాంగం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దిగువ కోర్టుల ప్రకారం.. ఆగస్టు 24 నాటికి అమెరికా వ్యాపారాలు చట్టవిరుద్ధంగా భావించిన సుంకాలను కవర్ చేయడానికి 210 బిలియన్ డాలర్లకు పైగా చెల్లించాయి. సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తే..ఇప్పటి వరకు ఆ దేశం వసూలు చేసిన సుంకాల్లో సగం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: France: కుప్పకూలిన ఫ్రెంచ్ గవర్నమెంట్.. రాజకీయ అనిశ్చితి