Israel-Gaza: గాజా ఖాళీ చేసి వెళ్లిపోండి.. స్థానికులకు ఇజ్రాయెల్ సంచలన వార్నింగ్

హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి సంచలన ఆదేశాలు జారీ చేసింది. అక్కడి నివాసితులు వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది.

New Update
Netanyahu threatens Gaza residents as UN slams Israel over ‘mass killing’

Netanyahu threatens Gaza residents as UN slams Israel over ‘mass killing’

హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి సంచలన ఆదేశాలు జారీ చేసింది. అక్కడి నివాసితులు వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది. హమాస్‌ వద్ద ఉన్న బందీలను విడుదల చేసి, ఆయుధాలు విడిచిపెట్టాలని వార్నింగ్ ఇచ్చింది. లేకపోతే తమ దాడులు మరింత ముమ్మరం చేస్తామని హెచ్చరించింది. అంతేకాదు ఇదే చివరి హెచ్చరిక అంటూ వ్యాఖ్యానించింది. 

Also Read: నువ్వు మమ్మల్నేం చేయలేవురా..ట్రంప్ టారిఫ్ లకు చెక్ పెడుతున్న భారత పెట్టుబడిదారులు

2023 దాడుల సమయంలో హమాస్‌ 48 మందిని బందీలుగా తీసుకుని వెళ్లిందని ఇజ్రాయెల్ రక్షణ దళం తెలిపింది. వాళ్లని ఇంకా విడుదల చేయలేదని పేర్కొంది. ఈ సందర్భంగా తాజాగా ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడారు. గాజా నివాసితులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. 

Also Read: అదే జరిగితే..సగం సుంకాలను తిరిగి చెల్లిస్తాం..అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్

మరోవైపు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్‌ టర్క్‌ ఇజ్రాయెల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజాలో జరుగుతున్న విధ్వంసం ప్రపంచాన్ని దిగ్ర్బాంతికి గురిచేస్తోందని విమర్శించారు. ఈ క్రమంలోనే తాజాగా నెతన్యాహూ పాలస్తీనా ప్రజలను గాజా నుంచి వెళ్లిపోవాలని ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా 2023 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ గాజాపై జరిపిన దాడుల్లో 64 వేల మందికి పైగా ప్రజలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. 

Advertisment
తాజా కథనాలు