Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్...ఆ రిజర్వేషన్లలోనూ బీసీలకు అవకాశం

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో బీసీల రిజర్వేషన్ విషయం లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. 42 శాతం పై కోర్టు అభ్యంతరంతో 24 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మిగిలిన 18 శాతం జనరల్ కేటాగిరిలో బీసీలకు కేటాయించనుంది.

New Update
Local body Election

Telangana Local Elections : స్థానిక సంస్థల ఎన్నికల(local body elections in telangana 2025)పై ఇటీవల మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పాత రిజర్వేషన్ల విధానంలోనే గ్రామపంచాయతీ ఎన్నికలు జరపాలని కేబినెట్‌ తీర్మానించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలు మాత్రం బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై వివాదం తేలిన తర్వాతే నిర్వహించాలని నిర్ణయించింది. కోర్టుల్లో పంచాయతీ ఎన్నికలపై మాత్రమే వివాదం ఉన్నందున వాటిని ముందుగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్‌ 20 లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశించినందున ముందుగా వాటిని పూర్తి చేయాలని నిర్ణయించారు. డిసెంబరు నెలలోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేలా కసరత్తు చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. BC రిజర్వేషన్లపై కేసులు కోర్టుల్లో తేలేందుకు సమయం పట్టనున్నందున ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పు, సుప్రీం కోర్టు సూచనల ప్రకారం 50శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు.

Also Read :  తవ్వకాల్లో దొరికిన బంగారం..నాదంటే నాదని ఫైట్‌..చివరికి ఏం జరిగిందంటే?

సమర్థవంతంగా ఎన్నికలు-..రాష్ట్ర ఎన్నికల సంఘం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిక(Local Bodie Elections 2025) లను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులకు సూచించారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతిభద్రతల అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు

కాగా,  స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక సమర్పించింది. పంచాయతీలు, వార్డుల వారీగా 50 శాతం మించకుండా SC, ST, BC లకు రిజర్వేషన్లు సిఫార్సు చేసింది. దీంతో డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. ఈనెల 24న హైకోర్టు విచారణకు ముందే ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటోంది. మరోవైపు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించేందుకు ఈసీ సిద్ధమైంది. డిసెంబర్ 20లోపు 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో పోలింగ్ జరుగనుంది.  

పాత పద్దతిలోనే ఎన్నికలు?

రాష్ట్రంలో 2024 నవంబర్‌ 6వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వేను నిర్వహించింది. దీనికి సంబంధించిన డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది. కమిషన్‌ నివేదిక ఆధారంగా గ్రామ పంచాయతీల్లో 50 శాతానికి మించకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవోలు ఇవ్వాలి. ఆ జీవోలు వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ ఇచ్చిన జీవో 9, అలాగే 41, 42 జీవోలు కూడా సూపర్‌సీడ్‌ అవుతాయి. అయితే, 2019లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22.3 శాతం, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 9.8 శాతం రిజర్వేషన్లు పాటించారు. ఈ నేపథ్యంలో పాత పద్ధతి ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read :  ప్రైవేటు వ్యక్తుల లబ్ధి కోసమే  ‘ఫార్ములా- ఈ’ కుట్ర..ఏసీబీ సంచలన ఆరోపణ

జనరల్‌లో బీసీలకు సీట్లు

గతంలో ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నించగా కోర్టు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీల రిజర్వేషన్‌ అంశంపై స్పష్టత కరువైంది. ఈ నేపథ్యంలో బీసీలకు 24 శాతం రిజర్వేషన్‌ కల్పించి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో చాలామంది ఔత్సహికులు ఎన్నికలకు సిద్దమయ్యారు. అయితే ఇపుడు రిజర్వేషన్లు మారే అవకాశం ఉండటంతో మిగిలిన 18 శాతం విషయంలో సందిగ్ధం నెలకొంది. అయితే బీసీలను నిరాశ పరచకుండా మిగిలిన 18 శాతాన్ని జనరల్‌కోటా కింద బీసీలు కూడా పోటీ చేయడానికి అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విధానాన్ని బీసీలు అంగీకరిస్తారా? లేదా అనేది నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత తేలనుంది.  స్థానిక ఎన్నికల నిర్వహణపై ఈ నెల 24లోపు రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని హైకోర్టుకు తప్పనిసరిగా చెప్పాల్సి ఉన్నందున అప్పటిలోగా అన్నీ సిద్ధంచేయాలని అధికారులు భావిస్తున్నారు. 25 లేదా 26వ తేదీన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ఇవ్వాలని కసరత్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు