/rtv/media/media_files/2025/11/21/fotojet-2025-11-21t122919568-2025-11-21-12-29-45.jpg)
The gold found in the excavations
Mulugu Police: గుప్త నిధుల కోసం జరిపిన తవ్వకాల్లో భారీగా బంగారం(gold-coins) లభించింది. దాన్ని పంచుకునే క్రమంలో వారి మధ్య బిగ్ ఫైట్ నెలకొంది. దాంతో ఆ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇంకేముంది పోలీసులు రంగంలోకి దిగి.. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.
Also Read : కాప్ సదస్సులో అగ్నిప్రమాదం.. 21 మందికి గాయాలు..!
The Gold Found In The Excavations - Mulugu
వివరాల ప్రకారం.. ములుగు జిల్లా(mulugu-district) మంగపేట మండలానికి చెందిన ఓ ఆటో డ్రైవర్‌కు మహారాష్ట్ర(maharashtra) లోని సిరివంచ సమీపంలో ఉన్న ఓ ఇంట్లో బంగారం నిధి ఉందని తెలిసింది. ఈ గుప్త నిధి సమాచారం తెలిసిన వెంటనే ఇదే గ్రామానికి చెందిన నలుగురిని తీసుకుని ఒక కారులో మహారాష్ట్రలోని సిరివంచకు వెళ్లారు. సిరివంచ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో బంగారం ఉన్నదని తెలిసిన సమాచారంతో.. ఆ ఇంట్లో ఐదు రోజులపాటు గడిపి బంగారు నిధి ఉన్న ప్రాంతంలో పూజలు జరిపి తవ్వకాలు చేపట్టారు. నిధి కోసం తవ్వుతున్న సమయంలో వాళ్ల సెల్ ఫోన్లలో వీడియో కూడా చిత్రీకరించారు.
పూజలు నిర్వహించిన అనంతరం గుప్తనిధి కోసం తవ్వకాలు జరిపారు. వారు అనుకున్నట్లే వారికి ఒక రాగిబిందె దొరికింది. అనంతరం దీనిపై దృష్టశక్తి ఉందని దానిని తొలగించాక వస్తామని ఇంటి యజమానికి చెప్పి దాన్ని తీసుకుని మంగపేటకు వచ్చారు.. అనంతరం మూడు కోళ్లను బలిచ్చి పూజలు నిర్వహించారు. తవ్వకాలలో బయటపడ్డ బిందెలో పెద్ద ఎత్తున బంగారు బిల్లలు లభ్యం అయినట్లు సమాచారం. ఒక్కో కాయిన్ సుమారు 23 గ్రాముల వరకు ఉంటుందని అక్కడికి వెళ్లిన ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. అయితే మహారాష్ట్ర నుంచి గుప్తనిధితో స్వగ్రామానికి చేరుకున్న వారందరూ బంగారు బిల్లలున్న బిందెపై శక్తి ఉంది.. పాతిపెట్టి పూజ చేశాక పంచుకుందామని ఏకాభిప్రాయానికి వచ్చారు. అనుకున్నట్లే ఇంటి పరిసరాల్లోని ఓ బొప్పాయి చెట్టు మొదట్లో పాతి పెట్టారు. ఇక్కడి వరకు బాగనే ఉన్నా మరుసటి రోజు పంపకాల విషయంలో తేడా జరిగింది..
ఈ విషయం ఆ నోట ఈ నోట కాస్త ఆలస్యంగా పోలీసులకు తెలియడంతో సదరు ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.. గుప్త నిధుల తవ్వకాల్లో దొరికిన రాగి బిందెపై వారు ఆరా తీశారు. ఈ తవ్వకాల్లో దొరికిన బిందెలో మొత్తం 36 బంగారం బిళ్లలు ఉన్నాయని విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఒక్కో బిళ్ల 23 గ్రాముల బరువు ఉందని పోలీసులకు వారు వివరించినట్లు సమాచారం. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. అయితే ఇంతకీ ఆ నిధి ఏమైంది..! అందులో దొరికిన బంగారం ఎంత..! ఎవరెవరు పంచుకున్నారు అనే విషయం మాత్రం గోప్యంగా ఉండిపోయింది. ప్రస్తుతం ఈ విషయం పోలీసుల పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.
Also Read : ప్రైవేటు వ్యక్తుల లబ్ధి కోసమే ‘ఫార్ములా- ఈ’ కుట్ర..ఏసీబీ సంచలన ఆరోపణ
Follow Us