/rtv/media/media_files/2025/09/15/bandi-sanjay-2025-09-15-18-49-50.jpg)
Bandi Sanjay
Bandi Sanjay: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జూబ్లీహిల్స్ ఎన్నికల(jubilee hills by elections 2025) సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ రోజు ఆయన బోరబండలో నిర్వహించతలపెట్టిన సభకు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం బండి సంజయ్ మీటింగ్ ఈరోజు సాయంత్రం బోరబండలో కొనసాగాల్సి ఉంది. తాజాగా ఆయన మీటింగ్ కు పర్మిషన్ ఇవ్వలేదు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ చేయనున్న ప్రచారంలో భాగంగా బోరబండలో బీజేపీ సభ నిర్వహించాలనుకున్నారు.
ఈ సభలో బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని మాట్లాడనున్నారు. అయితే ఆ సభ(bjp-meeting)కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం బండి సంజయ్ మీటింగ్ ఈరోజు సాయంత్రం బోరబండలో కొనసాగాల్సి ఉంది. తాజాగా ఆయన మీటింగ్ కు పర్మిషన్ ఇవ్వలేదు. మొదట పర్మిషన్ ఇచ్చి్నట్లే ఇచ్చి తర్వాత రద్దు చేయడంతో పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణుల మండిపడుతున్నాయి. కాంగ్రెస్ తమపై కుట్రలు చేస్తోందని, కనీసం ప్రచారం చేసుకోనివ్వకుండా ఇలా పర్మిషన్ కూడా ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి(bandi sanjay fire on cm revanth).
అయితే తమ సభకు ముందు అనుమతి ఇచ్చి ఇపుడు రద్దు చేయడమేంటని బీజేపీ ఎన్నికల ఇంఛార్జీ ధర్మారావు ప్రశ్నించారు. కచ్చితంగా సాయంత్రం బోరబండ(borabanda) లోనే మీటింగ్ జరిపి తీరుతామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. బీజేపీ శ్రేణులంతా భారీ ఎత్తున బోరండకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. బండి సంజయ్ సభకు ఆటంకాలు లేకుండా సహకరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని సూచించారు.
బోరబండకు వస్తున్నా..ఏం చేస్తారో చూస్తా..సంజయ్ మాస్ వార్నింగ్..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ ఆధ్వర్యంలో బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇచ్చినట్లుగానే ఇచ్చి ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బోరబండ సభకు అనుమతి ఇవ్వకపోవడంపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోరబండకు తాను వస్తున్నానని.. ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సీరియస్ అయ్యారు. ఇలాంటి నిర్బంధాలు, అడ్డంకులను బీజేపీ ఎన్నో ఎదుర్కొని పోరాడిందని కామెంట్ అన్నారు. బీజేపీ కార్యకర్తలారా, ప్రజలారా సాయంత్రం బోరబండకు తరలి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ దమ్మేందో ప్రభుత్వానికి చూపించాలని బండి సంజయ్ కాషాయ శ్రేణులకు పిలుపునివ్వడం సంచలనంగా మారింది.
Also Read: Trump: కమ్యూనిజం vs కామన్ సెన్స్.. మామ్దానీ విజయంపై ట్రంప్ వ్యాఖ్య
Also Read: J&K: కాశ్మీర్ లో దాడులకు లష్కరే, జైషే ఉగ్రవాదులు సంయుక్తంగా ప్లాన్..
Follow Us