Trump: కమ్యూనిజం vs కామన్ సెన్స్.. మామ్దానీ విజయంపై ట్రంప్ వ్యాఖ్య

న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైన జోహ్రాన్ మామ్దానీ విజయంపై అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిజం vs కామన్ సెన్స్ గా ఆయన గెలుపు ను అభివర్ణించారు. మామ్దానీ విజయవంతం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.

New Update
mamadani

న్యూయార్క్ లో జోహ్రాన్మామ్దానీ గెలుపుపై అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తిగా ఉన్నప్పటికీ దానిని ఎక్కడా బయటపెట్టకుండా జాగ్రత్తగా వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మియామీలో జరిగిన ఆర్థిక సమావేశంలో మాట్లాడుతూ జోహ్రాన్ విజయాన్ని కమ్యూనిజం vsకామన్ సెన్స్ గా అభివర్ణించారు. న్యూయార్క్ మేయర్ గా ఆయన విజయవంతం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. డెమోక్రటిక్ సోషలిస్ట్ జోహ్రాన్మమ్దానీకి పరిమిత సమాఖ్య సహాయం అందించవచ్చని సూచించారు. మామ్దానీ నేతృత్వంలో తగ్గించబడిన నిధులను ఎదుర్కోవలసి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు.

డెమోక్రాట్ల విజయంపై విరుచుకుపడ్డ ట్రంప్..

జోహ్రాన్మామ్దానీ విజయంపై అధ్యక్షుడు ట్రంప్ పాజిటివ్ గానే మాట్లాడినప్పటికీ డెమోక్రాట్ల విజయంపై మాత్రం తీవ్రంగా విరుచుకుపడ్డారు. కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, సోషలిస్టులు మరియు ప్రపంచవాదులకు అవకాశం లభించిందని...వారు విపత్తులను తప్ప అమెరికాకు ఏమీ ఇవ్వలేరని విమర్శించారు. న్యూయార్క్ కమ్యూనిస్ట్ ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దామంటూ వ్యాఖ్యలు చేశారు. నగర మేయర్ ఎన్నికను జాతీయ రాజకీయాలతో అనుసంధానిస్తూ, మమ్దానీ విజయాన్ని "కాంగ్రెస్ డెమొక్రాట్లు అమెరికా కోసం ఏమికోరుకుంటున్నారో దానికి ఒక ఉదాహరణ" అని అభివర్ణించారు. దీంతో పాటూ ఈ ఏడాదిలో తాను అమెరికాను ఆర్థికంగా అద్భుతంగా తీర్చిదిద్దానని ట్రంప్చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ప్రత్యర్థులు ఇందుకు విరుద్ధంగా మళ్ళీ దానిని పీడకలగా మారుస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారు అమెరికాను చివరి స్థానంలో ఉంచారు.. మేము అమెరికాను మొదటి స్థానంలో ఉంచాము అని అన్నారు.

Advertisment
తాజా కథనాలు