/rtv/media/media_files/2025/09/28/bathukamma-dussehra-rush-2025-09-28-21-29-49.jpg)
Bathukamma..Dussehra rush
Bathukamma..Dussehra :తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ప్రధాన బస్టాండ్లు, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్‌లు రద్దీగా మారాయి. హైదరాబాద్ లోని ప్రధాన బస్టాండ్లు అయిన ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మరోపక్క సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో రద్దీ నెలకొంది. సెలవుల నేపథ్యంలో తెలంగాణతో పాటు ఏపీ వాసులు కూడా తమ సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవ్వడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే 2వేలకు పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మరోవైపు టీజీఎస్ఆర్టీసీ 7,754 ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. అయినప్పటికీ... ఏమాత్రం ప్రయాణీకుల రద్దీకి ఏమాత్రం సరిపోవడంలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Raipur Steel Plant Collapses: కుప్పకూలిన స్టీల్ ప్లాంట్.. ఐదుగురు కార్మికుల దుర్మరణం!
కేవలం ఎంజీబీఎస్, జేబీఎస్‌లకే పరిమితం కాకుండా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ బస్టాండ్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి కూడా ఆయా ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. ముఖ్యంగా బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు వెళ్లే బస్సులు అత్యంత రద్దీతో నిండిపోయాయి. జేబీఎస్ బస్టాండ్‌లో బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. బస్సుల కోసం పరుగులు తీస్తున్నారు.ఇక పండుల నేపథ్యంలో వేసిన ప్రత్యేక బస్సుల్లో అదనంగా 50 శాతం వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేయడంతో ప్రయాణీకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. రెండు రోజులు దంచుడే దంచుడు
దసరా, దీపావళి పండుగల సందర్భంగా రైలు ప్రయాణాలు కూడా బాగా పెరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన వాళ్లు...పండుగలను సొంతూళ్లకు వెళ్తుండటంతో రద్దీ పెరిగింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో రద్దీగా మారిపోయాయి. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే 2 వేలకు పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయినా సరిపోవడం లేదు.
దసరా పండుగను పురష్కరించుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రద్దీని తగ్గించడం కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని.. ఈనెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు పదిరోజుల పాటు తాత్కాలిక రైళ్ల స్టాప్‌లను కూడా ప్రకటించింది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వెళ్లే రైళ్లు...హైటెక్ సిటీ, లింగంపల్లి, చర్లపల్లి స్టేషన్లలో కూడా ఆగేందుకు అవకాశం ఇచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రయాణికులు సికింద్రాబాద్ స్టేషన్‌కు రాకుండానే.. ఆయా స్టేషన్ల నుంచే ప్రయాణించే వెసులుబాటు ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చూడండి: TG News: హైదరాబాద్‌లో పోకిరీల అరాచకం.. పేషెంట్‌తో వెళ్తున్న అంబులెన్స్‌ను ఆపి.. కాళ్లు మొక్కించుకుని..!