Raipur Steel Plant Collapses: కుప్పకూలిన స్టీల్ ప్లాంట్.. ఐదుగురు కార్మికుల దుర్మరణం!

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్‌లో నిర్మాణం కూలిపోవడంతో దాదాపు ఐదుగురు కార్మికులు స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో అనేక మంది కార్మికులు గాయపడ్డారు.

New Update
Raipur Steel Plant Collapses 5 Killed, Several Injured (1)

Raipur Steel Plant Collapses 5 Killed

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్‌లో నిర్మాణం కూలిపోవడంతో దాదాపు ఐదుగురు కార్మికులు స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో అనేక మంది కార్మికులు గాయపడ్డారు. రాజధాని శివార్లలోని సిల్తారా ప్రాంతం గోదావరి ఇస్పాత్ లిమిటెడ్ ప్లాంట్‌లో ఈ సంఘటన జరిగిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. 

Raipur Steel Plant Collapses

ఈ ఘటనపై ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసు బృందాన్ని సంఘటనా స్థలానికి పంపాం. సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఐదుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన కార్మికులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. మరికొంత మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నాం. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.’’ అని ఆయన తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు