Telangana News : గెరువిచ్చిన వాన..తేరుకున్న ఎంజీబీఎస్..రాకపోకలు షురూ
ఈ రోజు నగరంలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ఎంజీబీఎస్ వరద నుంచి తేరుకుంది. బస్టాండ్‌కు వచ్చే మార్గంలోని శివాజీ బ్రిడ్జి, ఎంజీబీఎస్‌లోని ప్లాట్‌ఫాం 56, 58, 60 వద్ద పేరుకుపోయిన బురదను శుభ్రం చేశారు. ప్రస్తుతం బస్సు సర్వీసులు ఎంజీబీఎస్ నుంచే ప్రారంభించారు.