Bandi sanjay: BRS లుచ్చాలు మమ్మల్ని చంపాలని చూశారు ...కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు.

బీఆర్ఎస్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. నల్గొండ జిల్లాలో రైతుల వద్దకు వెళితే బీఆర్ఎస్ లుచ్చాలు తమను చంపాలని చూశారని చెప్పారు. కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? సీఎం రేవంత్ కు పౌరుషం చచ్చిపోయిందా అని ప్రశ్నించారు. 

New Update
Bandi Sanjay KCR

Bandi Sanjay KCR

Bandi sanjay: బీఆర్ఎస్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. నల్లగొండ జిల్లాలో రైతుల వద్దకు వెళితే బీఆర్ఎస్ లుచ్చాలు తమను చంపాలని చూశారని చెప్పారు. అవినీతి కేసుల్లో ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? సీఎం రేవంత్ కు పౌరుషం చచ్చిపోయిందా అని ప్రశ్నించారు. 

కేసీఆర్ కాంగ్రెస్ తో డీల్..

ఈ మేరకు ఆదివారం చెన్నూరు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి కేసుల్లో ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఢిల్లీలో కేసీఆర్ కాంగ్రెస్ తో డీల్ చేసుకున్నందుకు చేష్టలుడిగిపోయారా? అని ప్రశ్నించారు. బీజేపీని అణిచివేయడానికి కాంగ్రెస్ తో లోపాయికారీ ఒప్పందం చేసుకుంటారా? అని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: Uganda-Indian Woman:లంచం ఇచ్చాకే నీళ్లు, ఫుడ్. జైలు కష్టాలను గురించి చెప్పకొచ్చిన భారత బిలియనర్ కుమార్తె

ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. టీచర్లు, నిరుద్యోగులు, రైతుల పక్షాన కొట్లాడి జైలుకు పోయిన చరిత్ర బీజేపీదేనని చెప్పారు. కేసులకు భయపడకుండా తెగించి కొట్లాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలదే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా ఏ కాంగ్రెస్ నాయకుడైనా ప్రజా సమస్యపై జైలుకు వెళ్లారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో 14 నెలల కాంగ్రెస్ మోసాలకు బుద్ది చెప్పాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. బీజేపీ కార్యకర్తలు చేస్తున్న పోరాటాలకు బలమివ్వాలని రిక్వెస్ట్ చేశారు. బీజేపీలో ఒకే గ్రూప్ ఉందని, తామంతా నరేంద్రమోదీ గ్రూప్ అని చెప్పారు. 

ఇది కూడా చదవండి: Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు