Obesity: దంపతుల్లో పెరుగుతున్న ఒబెసిటీ ప్రమాదం.. ICMR హెచ్చరికలు తెలుసుకోండి

ICMR అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో ప్రతి నాలుగు పెళ్లి జంటలలో ఒక జంట ఒబెసిటీతో బాధపడుతోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలోని జంటల డేటా తయారు చేశారు. ఒకరి జీవనశైలి అలవాట్లను మరొకరు అనుసరించడం వల్ల ఒబెసిటీ సమస్య ఉధృతమవుతోందని పరిశోధకులు వివరించారు.

New Update
Obesity

Obesity

Obesity: ఆధునిక జీవనశైలి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఒబెసిటీ వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఇది పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా కనిపించే సమస్యగా ఉండేది. అయితే ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ సమస్య భయంకరంగా విస్తరిస్తోంది. పట్టణీకరణ, ఉద్యోగ ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పులు, ప్రాసెస్‌డ్ ఫుడ్‌కి అలవాటు పడటం తదితర కారణాల వల్ల భారతీయుల ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటోంది. ఇటీవల ICMR నిర్వహించిన అధ్యయనం ప్రకారం భార్యాభర్తల మధ్య ఒబెసిటీ సమస్య తీవ్రంగా పెరుగుతోందని తేలింది.

భారతీయులకు ICMR హెచ్చరికలు:

ICMR అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో ప్రతి నాలుగు పెళ్లి జంటలలో ఒక జంట మాత్రం ఓవర్‌వెయిట్‌ లేదా ఒబెసిటీతో బాధపడుతోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-5, 2019-21)లోని 52,737 జంటల డేటాను విశ్లేషించి ఈ నివేదికను తయారు చేశారు. ఒకరి జీవనశైలి అలవాట్లను మరొకరు అనుసరించడం వల్ల ఒబెసిటీ సమస్య ఉధృతమవుతోందని పరిశోధకులు వివరించారు.  వారిలో దాదాపు 47.6 శాతం జంటలు అధిక బరువు లేదా ఒబెసిటీతో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఇది వేగంగా పెరుగుతోంది. పట్టణాల్లో  38.4 శాతం పెరగ్గా.. గ్రామీణ ప్రాంతాల్లో 22.1 శాతం మాత్రం ఉందని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆఫీస్‌ సవాళ్లను క్షణాల్లో అధిగమించే చిట్కాలు.. ఇలా ట్రై చేయండి

కొన్ని రాష్ట్రాల్లో ఒబెసిటీ తీవ్ర స్థాయిలో ఉంది. కేరళలో 51.3%,  జమ్మూ కాశ్మీర్‌లో 48.5%, మణిపూర్‌లో 47.9%, ఢిల్లీలో 47.1%, గోవాలో 45%, తమిళనాడులో 42.7%, పంజాబ్‌లో 42.5% మంది భార్యాభర్తలు ఒబెసిటీ, అధిక బరువుతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఇది మధ్యస్థాయిలో ఉండగా తూర్పు, ఈశాన్య భారతదేశంలో మాత్రం ఈ సమస్య తక్కువగా ఉంది. ఒకే రకమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా భార్యాభర్తలిద్దరికి ఒబెసిటీ వస్తోందని పరిశోధకులు చెప్పారు. టీవీ ముందు ఎక్కువ సమయం గడపడం, శారీరక చొరవ తగ్గిపోవడం, ప్రాసెస్‌డ్ ఫుడ్ ఎక్కువగా తినడం వంటివి దీనికి కారణమవుతున్నాయి. చిన్న కుటుంబాల్లో ఒబెసిటీ సమస్య ఎక్కువగా ఉండటం గమనార్హం. చిన్న వయసులో పెళ్లైన జంటల్లో కూడా ఈ సమస్య వేగంగా పెరుగుతోంది. 30 సంవత్సరాల లోపు యువ దంపతుల్లో ఒబెసిటీ ప్రమాదకరంగా ఉన్నట్లు అధ్యయనం చెబుతోంది.

ఇది కూడా చదవండి: బీహార్‌లో వింత నాగ పంచమి ఉత్సవం.. విషపు పాములతో ఊరంతా..


( obesity | Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News | telugu-news )

Advertisment
Advertisment
తాజా కథనాలు