/rtv/media/media_files/2025/09/13/mother-kills-three-year-old-daughter-2025-09-13-11-12-53.jpg)
Mother kills three-year-old daughter
Crime: మెదక్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన ఓ తల్లి రెండేళ్ల కన్న కూతురిని హత్య చేసింది. ప్రియుడితో పాటు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శబాష్‌పల్లికి చెందిన బొట్టు మమతకు 5ఏళ్ల క్రితం రాయపోల్ మండలం వడ్డేపల్లికి చెందిన భాస్కర్‌తో పెళ్లయింది. భాస్కర్, మమత దంపతులకు చరణ్, తనుశ్రీ ఇద్దరు పిల్లలున్నారు. భాస్కర్‌కు నత్తి ఉందనే కారణంతో మమత పుట్టింటికి వెళ్లిపోయింది.-- పుట్టింట్లో ఉండగా మమతకు అదేగ్రామానికి చెందిన ఫయాజ్‌తో అక్రమసంబంధం ఏర్పడింది. ఈ ఏడాది మార్చిలో ప్రియుడు ఫయాజ్‌తో కలిసి మమత వెళ్లిపోయింది. అయితే --పెద్దల జోక్యంతో తిరిగి వచ్చిన మమత భాస్కర్‌తో కలిసి ఉండేందుకు ఒప్పుకుంది.
ఇది కూడా చూడండి: Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ !
జూన్ 7న మమత మరోసారి ఫయాజ్‌తో వెళ్లిపోయింది.-కొడుకు శ్రీచరణ్‌ను పుట్టింట్లో వదిలేసి కూతురు తనూశ్రీని తీసుకుని ప్రియుడితో మమత జంపయింది. అయితే మమతతో పాటు ఆమె కుమార్తె తనుశ్రీ కూడా కనిపించక పోవడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు… పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా మమత, ఫయాజ్ ఏపీలోని గుంటూరులో ఉన్నారని తెలుసుకొని, అక్కడికి వెళ్లి అదుపులో తీసుకుని విచారించారు. అయితే మమత(23) మెంట కూతురు కనిపించకపోవడంతో ఏం చేశారని పోలీసులు విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది.
ఇది కూడా చూడండి:TG-AP Rains: తెలంగాణ, ఏపీకి రెయిన్ అలర్ట్.. డేంజర్‌లో ఉన్న జిల్లాలివే!
-- కూతురు తనుశ్రీని తన వెంట తీసుకెళ్లిన మమత ఊరి చివర గొంతు పిసికి, గొయ్యి తీసి పాతిపెట్టినట్లు తేలింది. తనుశ్రీని తామే చంపినట్లు విచారణలో ఆ ఇద్దరూ అంగీకరించారు. కుమార్తె తను శ్రీని గొంతుపిసికి చంపి గ్రామ శివారులో పాతిపెట్టామని చెప్పారు. పాపను పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని నిందితులు చూపించగా, శుక్రవారం పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు దర్యాప్తులో ఉంది. ప్రియుడితో పాటు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి:ఇదేం ట్రాఫిక్ రా బాబు.. హైటెక్ సిటీ ఏరియాలో వాహనాలు ఎలా ఆగాయో చూడండి-PHOTOS