/rtv/media/media_files/2025/12/26/fotojet-15-2025-12-26-19-31-12.jpg)
Husband Killed Wife
Hyderabad: నగరంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్యపై పెట్రోల్ పోసి భర్త నిప్పంటించాడో భర్త(Husband Ki*ll*s Wife). అది కూడా పిల్లల ముందే ఈ అఘాయిత్యానికి(Husband Ki*ll*s Wife In Front Of Son) పాల్పడ్డాడు, భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. నల్లకుంట పీఎస్ పరిధిలో బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read : కెనడాలో భారతీయ విద్యార్ధి దారుణ హత్య.. ఆరేళ్లలో 172 మంది బలి
Husband Killed Wife
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్, త్రివేణి భార్యాభర్తలు.వీరిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. గత కొంతకాలంగా తిలక్‌నగర్‌లో నివాసముంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. అయితే ఇటీవల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా భర్త వేధింపులు తాళలేక భార్య త్రివేణి పుట్టింటికి వెళ్లింది. దీంతో అక్కడికి వెళ్లిన వెంకటేశ్.. తాను మారానని, ఇకపై బాగా చూసుకుంటానంటూ నమ్మించి త్రివేణిని హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. తిరిగి గొడవలు మొదలవ్వడంతో భార్యను అంతం చేయాలని వెంకటేశ్ నిర్ణయించుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో ఆమెపై దాడి చేసిన వెంకటేష్ అనంతరం త్రివేణి ఒంటిపై పెట్రోల్ పోసి(murder) నిప్పంటించి పరారయ్యాడు.
కాగా తల్లిపై పెట్రోల్ పోస్తుండగా అడ్డుకున్న కూతురినీ మంటల్లో తోసేసిన వెంకటేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. కేకలు విన్న స్థానికులు వెంటనే ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ త్రివేణి మృతిచెందింది. కూతురు స్వల్పగాయాలతో బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. తమ కుమార్తెను ఇలా దారుణంగా చంపేశాడంటూ త్రివేణి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనుమానంతో భార్యను హత్య చేసి భర్త జైలు పాలవడంతో.. ఇద్దరు చిన్నారులు అనాధలుగా మిగిలిపోయారు. తల్లి కోసం చిన్నారులు విలపిస్తున్న తీరు అక్కడి వారిని తీవ్రంగా కలిచివేసింది.
Also Read : ఉన్నావ్ గ్యాంగ్ రే*ప్ కేసులో షాకింగ్ విషయాలు.. 2017-2025 జరిగింది తెలిస్తే షాక్!
Follow Us