ఉన్నావ్ గ్యాంగ్ రే*ప్ కేసులో షాకింగ్ విషయాలు.. 2017-2025 జరిగింది తెలిస్తే షాక్!

అది 2017 జూన్ 4.. భారతదేశ చరిత్రలోనే అత్యంత దారణం జరిగిన రోజు. ఉద్యోగం కోసం వెళ్లిన మైనర్ బాలికను ఎమ్మెల్యే అతని అనుచరులు గ్యాంగ్ రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘోరం ఉన్నావ్ గ్యాంగ్ రేప్ కేసుగా ఎన్నో మలుపులు తిరిగింది.

New Update
Unnauo case

అది 2017 జూన్ 4.. భారతదేశ చరిత్రలోనే అత్యంత దారణం జరిగిన రోజు. ఉద్యోగం కోసం వెళ్లిన మైనర్ బాలికను ఎమ్మెల్యే అతని అనుచరులు గ్యాంగ్ రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘోరం ఉన్నావ్ గ్యాంగ్ రేప్ కేసుగా ఎన్నో మలుపులు తిరిగింది. తొమ్మిదేళ్లుగా బాధితురాలి తరుపున న్యాయం కోసం పోరాటం జరుగుతూనే ఉంది. ఈ తొమ్మిదేళ్లలో భయకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. అధికారం చేతిలో చితికిన ఆ యువతి చేస్తున్న న్యాయపోరాటంలో ఆమె ఇద్దరు అత్తలు, తండ్రిని కూడా కోల్పోయింది. నిందితుల హత్యాయత్నంలో చావు అంచుల దాకా వెళ్లినా ఆమె న్యాయపోరాటం ఆగలేదు. ఉన్నావ్ గ్యాంగ్ రేప్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక నిందితుడైన BJP మాజీ ఎమ్మె్ల్యే కుల్దీప్ సెంగార్‌‌కు బెయిల్ మంజూరు చేసింది. నేరం రుజువై జీవిత ఖైదు పడిన ఈ కేసులో ప్రధాన నిందితుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు కూడా బెయిల్ వచ్చింది. ఉన్నావ్ గ్యాంగ్ రేప్ కేసులో ఒక తప్పుని కప్పిపుచుకోడానికి మరో తప్పు చేస్తూ.. అలా హత్యల మీద హత్యలు చేసుకుంటూ వచ్చారు. 

అసలేంజరిగిందంటే..

2017 ఆగస్టు 17న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు రాసిన బహిరంగ లేఖలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉన్నావ్ నియోజకవర్గంలో ఉద్యోగం కోసం వెతుకుతున్న 17ఏళ్ల మైనర్ బాలికను శశి సింగ్ అనే మహిళ, ఆమె కొడుకు శుభం సింగ్, కుమార్తె నిధి సింగ్‌లు ట్రాప్ చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్లి యువతిపై శుభం సింగ్, అతని డ్రైవర్ అవధేష్ తివారీ అనేకసార్లు అత్యాచారానికి పాల్పడాడ్డారు. తర్వాత రూ.60వేలకు బ్రజేష్ యాదవ్‌కు బాలికను అమ్మేశారు. అక్కడి నుంచి తప్పించుకున్న యువతిని శుభమ్ సింగ్, బ్రిజేష్ యాదవ్‌లు మళ్లీ ఓ గ్రామంలో పట్టుకొని కిడ్నాప్ చేశారు. ఆమెకు మత్తుమందు ఇచ్చి చాలా రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పాడ్డారు.

ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్

అక్కడి నుంచి వారి యువతిని అప్పటి అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఇంటికి తీసుకెళ్లారు. 2017 జూన్ 4న రాత్రి ఆమెపై ఎమ్మెల్యే, అతని అనుచరులు అత్యంత క్రూరంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అందుకు ఒప్పుకొని బాలికను కట్టేసి కొడుతూ చిత్ర హింసలకు గురి చేశారు. జరిగింది పోలీసులకు ఫిర్యాదు చేసినా బాధితురాలికి న్యాయం జరగలేదు. ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అధికార, అంగ బలంతో ఆమె కుటుంబాన్ని టార్గెట్ చేశాడు. కనీసం పోలీసులు  ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు. బాధితురాలి తండ్రిని ఓ తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపారు. పైగా బాధితురాలి కుటుంబాన్ని బెదిరించడం ప్రారంభించారు. MLA సెంగార్, అతని సోదరుడు, ముగ్గురు పోలీసులతోపాటు మరో ఐదుగురు అత్యాచార బాధితురాలి తండ్రిని నేరస్థుడిగా ఇరికించి అరెస్ట్ చేయించారు. పోలీసుల కస్టడీలోనే బాధితురాలి తండ్రి చనిపోయాడు. జూన్ - ఆగస్టు 2017న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా, రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. దీంతో బాధితురాలు సీఎం యోగికి బహిరంగ లేఖ రాసింది.

2018లో సీఎం ఆఫీస్ ముందు ఆత్మహత్యాయత్నం

నిందితులపై పోలీసులు ఏ చర్య తీసుకోకపోవడంతో బాధితురాలు 2018 ఏప్రిల్ 8న లక్నోలోని సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం ముందు ఆత్మహత్యాయత్నం చేసింది. 2018 ఏప్రిల్ 9న బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సెంగార్ సోదరుడు అతడిని కొట్టడం వల్లే చనిపోయాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ అంశం మీడియా దృష్టిలో పడింది. ప్రజలు, యవతు ఆమెకు సపోర్ట్‌గా నిలబడ్డారు. విచారణ కోసం డిమాండ్ చేశారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో ఏప్రిల్ 13న ఉన్నావ్ రేప్ కేసు సీబీఐకి అప్పగించారు. దేశవ్యాప్త నిరసనల తర్వాత CBI కుల్దీప్ సెంగార్‌ను అరెస్ట్ చేసింది.

బాధితురాలిపై మర్డర్ అటెంప్ట్ (2019)

కేసు విషయంలో వెనక్కి తగ్గాలని సెగార్ బాధితురాలిని బెదిరించడం ప్రారంభించాడు. 2019 జూలై 28న బాధితురాలు ప్రయాణిస్తున్న కారును రాయ్‌బరేలీ వద్ద ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె ఇద్దరు అత్తలు చనిపోగా, బాధితురాలు, ఆమె న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. ఇది ప్రమాదం కాదు, సెంగార్ చేయించిన హత్యాయత్నమని తర్వాత తేలింది. సుప్రీంకోర్టు 2019 ఆగస్టు 1న ఈ కేసును ఉత్తరప్రదేశ్ నుండి ఢిల్లీకి బదిలీ చేసింది. బాధితురాలికి మరియు ఆమె కుటుంబానికి CRPF భద్రత కల్పించాలని ఆదేశించింది.

ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు 2019 డిసెంబర్ 16న సెంగార్‌ను దోషిగా తేల్చింది. డిసెంబర్ 20 సెంగార్‌కు జీవిత ఖైదు, రూ.25 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులో కూడా 2020 మార్చిలో సెంగార్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది.

శిక్ష రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు బెయిల్ 

దాదాపు ఐదేళ్ల జైలు జీవితం తర్వాత, ఢిల్లీ హైకోర్టు సెంగర్ దాఖలు చేసిన అప్పీల్‌పై కీలక తీర్పునిచ్చింది. సెంగర్ దాఖలు చేసిన అప్పీల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున, ఆయన జీవిత ఖైదు శిక్షను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ కేసు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 5(c) కింద సెంగర్‌ను 'పబ్లిక్ సర్వెంట్'గా పరిగణించి గతంలో శిక్ష వేశారని, కానీ సాంకేతికంగా అది సరికాదని ప్రాథమికంగా కోర్టు అభిప్రాయపడింది. సెంగార్ శిక్షను సస్పెండ్ చేస్తూ 2025 డిసెంబర్ 23న కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.15 లక్షల వ్యక్తిగత బాండ్ సమర్పించాలి. బాధితురాలి నివాసానికి 5 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్లకూడదు. తన పాస్‌పోర్టును కోర్టులో అప్పగించాలి మరియు ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేయాలని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

‘తీర్పు ఫ్యామిలీకి మరణ శాసనం’

భద్రతా కారణాల దృష్ట్యా ఉన్నావ్ గ్యాంగ్ రేప్ విక్టిమ్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో కాకుండా, ఢిల్లీలోని ఓ సురక్షిత ప్రాంతంలో నివసిస్తున్నారు. ప్రభుత్వం ఆమెకు నివాస వసతిని కల్పించింది. ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్నందున ఆమెతోపాటు బాధితురాలి కుటుంబానికి CRPF దళాలతో నిరంతరం భారీ భద్రత కల్పిస్తున్నారు. 2019లో జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో ఆమె ఊపిరితిత్తులకు, ఎముకలకు తీవ్ర గాయాలయ్యాయి. చాలా కాలం పాటు వెంటిలేటర్‌పై చికిత్స పొందిన తర్వాత ఆమె కోలుకున్నారు, కానీ ఆ ప్రమాద ప్రభావం ఇప్పటికీ ఆమె ఆరోగ్యంపై ఉంది. ఆమె ఇప్పటికీ కుల్దీప్ సెంగర్, ఇతర నిందితులకు వ్యతిరేకంగా కోర్టులలో పోరాటం చేస్తూనే ఉన్నారు. తాజాగా సెంగర్‌కు బెయిల్ మంజూరు కావడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ తీర్పుపై బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడికి బెయిల్ రావడం తన కుటుంబానికి "మరణ శాసనం"వంటిదని, తమకు రక్షణ లేదని కన్నీటి పర్యంతమైంది. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆమె నిరసన కూడా చేపట్టింది. ఈ బెయిల్ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని బాధితురాలు ప్రకటించింది. సీబీఐ కూడా సెంగార్ బెయిల్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఈ కేసు మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానం మెట్లు ఎక్కనుంది. 

Advertisment
తాజా కథనాలు