Crime : పట్టపగలు నడిరోడ్డుపై దారుణం...భార్యను కాల్చి చంపి...
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో పట్టపగలు దారుణహత్య జరిగింది. ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను భర్త అత్యంత దారుణంగా నడిరోడ్డుపై కాల్చి చంపాడు. స్థానిక రూప్సింగ్ స్టేడియం సమీపంలో అరవింద్ అనే కాంట్రాక్టరు భార్య నందినిని తుపాకితో కాల్చి చంపడం కలకలం రేపింది.