కెనడాలో భారతీయ విద్యార్ధి దారుణ హత్య.. ఆరేళ్లలో 172 మంది బలి

కెనడాకు హైయిర్ స్టడీస్ కోసం వెళ్లిన మరో భారతీయ విద్యార్థి తుపాకీ తూటాలకు బలైపోయాడు. టొరంటోలోని ఓ యూనివర్సిటీకి చెందిన 20 ఏళ్ల విద్యార్థిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన డిసెంబర్ 23న చోటుచేసుకోగా, శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

New Update
Indian student

కెనడాకు హైయిర్ స్టడీస్ కోసం వెళ్లిన మరో భారతీయ విద్యార్థి తుపాకీ తూటాలకు బలైపోయాడు. టొరంటోలోని ఓ యూనివర్సిటీకి చెందిన 20 ఏళ్ల విద్యార్థిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన డిసెంబర్ 23న చోటుచేసుకోగా, శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మృతుడిని శివాంక్ అవస్థీ(20) గా గుర్తించారు. అతడు టొరంటో యూనివర్సిటీ (స్కార్‌బరో క్యాంపస్)లో లైఫ్ సైన్సెస్ మూడో సంవత్సరం చదువుతున్నారు. 2019 నుండి 2024 మధ్య కాలంలో కెనడాలో సుమారు 172 మంది భారతీయ విద్యార్థులు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ విద్యార్థులు అత్యధికంగా మరణిస్తున్న దేశాల్లో కెనడా మొదటి స్థానంలో ఉంది.

Also Read: అమెరికా రక్షణ శాఖ షాకింగ్ విషయాలు.. భారత్‌కు చైనా నుంచే ప్రమాదం!

మంగళవారం (డిసెంబర్ 23) మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని అక్కడి పోలీసులు తెలిపారు. యూనివర్సిటీ సమీపంలోని 'హైలాండ్ క్రీక్ ట్రైల్', 'ఓల్డ్ కింగ్‌స్టన్ రోడ్' ప్రాంతంలో శివాంక్ బుల్లెట్ గాయాలతో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, శివాంక్ అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. నిందితులు పోలీసులు రాకముందే అక్కడి నుంచి పరారయ్యారు.

పరారీలో నిందితులు.. పోలీసుల గాలింపు

ఈ ఘటనను 'హోమిసైడ్' (హత్య)గా పరిగణించిన టొరంటో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ ఏడాది టొరంటోలో నమోదైన 41వ హత్య ఇది. కాల్పులు జరిగిన సమయంలో క్యాంపస్‌ను కాసేపు లాక్‌డౌన్ చేసి అధికారులు తనిఖీలు చేపట్టారు.

Also Read: డిఫెన్స్ రంగంలో ఇండియా మరో విజయం.. ఇక సముద్రంలోంచి అణు దాడులే!

శివాంక్ అవస్థీ యూనివర్సిటీ చీర్లీడింగ్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నారని, ఆయన మృతి పట్ల సహచర విద్యార్థులు మరియు అధ్యాపకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్యాంపస్ సమీపంలోని ట్రైల్స్‌లో సరైన భద్రత, వెలుతురు లేకపోవడమే ఇలాంటి దారుణాలకు కారణమని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇండియన్ కాన్సులేట్ స్పందన

ఈ విషాద ఘటనపై టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "టొరంటో యూనివర్సిటీ సమీపంలో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి శివాంక్ అవస్థీ మరణించడం అత్యంత బాధాకరం. బాధిత కుటుంబానికి మేము అన్ని విధాలా అండగా ఉంటాం. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నాం" అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కెనడాలో ఇటీవలి కాలంలో భారతీయ విద్యార్థులపై దాడులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇదే వారం ప్రారంభంలో హిమాన్షీ ఖురానా అనే మరో భారత సంతతి మహిళ కూడా టొరంటోలో అనుమానాస్పద రీతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు