Kaleshwaram project : కాళేశ్వరం పై మరోసారి ఎంక్వయిరీ? నిపుణుల కమిటీ ఏర్పాటు..

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో ఏర్పడిన సందిగ్ధతకు తెరదించి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బారేజీలను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ప్రభత్వం భావిస్తోంది. దానికోసం కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్‌ ఎ.బి.పాండ్య ఛైర్మన్‌గా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

New Update
Kaleshwaram project

Kaleshwaram project Photograph: (Kaleshwaram project )

Kaleshwaram project : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో ఏర్పడిన సందిగ్ధతకు తెరదించి, ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బారేజీలను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ప్రభత్వం భావిస్తోంది. దానికోసం ప్రభుత్వం కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్‌ ఎ.బి.పాండ్య ఛైర్మన్‌గా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఏడుగురు సభ్యులను నియమించింది. వారిలో ఏబీ పాండ్యాతో పాటు , మెంబర్‌ సెక్రటరీ- సీఈ, రామగుండం, సభ్యులు- ఈఎన్సీ జనరల్, ఈఎన్సీ ఓఅండ్‌ఎం, సీఈ, సీడీవో, కె.సత్యనారాయణ, రిటైర్డ్‌ సీఈ, గేట్స్‌ నిపుణులు, ప్రొఫెసర్‌ ఎన్‌.రమణమూర్తి, నిట్‌(వరంగల్‌), భూభౌతిక సాంకేతికత, రాక్‌ మెకానిక్‌ నిపుణులు, ప్రొఫెసర్‌ ఆర్‌.సతీష్, ఐఐటీ హైదరాబాద్, హైడ్రాలజీ నిపుణులు, మరో ఇద్దరు ఆహ్వానితులకు అవకాశం కల్పించాలని భావిస్తోంది.

Also Read : Pawan : మీకో దండంరా బాబు.. టాలీవుడ్ పై పవన్ ఫైర్!

Also Read : Cinema News: పవన్‌పై కుట్రతోనే థియేటర్ల మూసివేత.. ఆ నలుగురే ఇదంతా చేస్తున్నారా!?


కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఫిల్లర్ల కుంగుబాటు, ఇతర సాంకేతిక సమస్యలపై కేంద్రానికి చెందిన జాతీయ ఆనకట్టల భద్రత పర్యవేక్షణ సంస్థ(ఎన్డీఎస్‌ఏ) ప్రభుత్వానికి తుది నివేదిక అందజేసింది. అయితే పథకంలో నిర్మాణంలో ప్రధాన నిర్మాణ సంస్థగా ఉన్న ఎల్‌అండ్‌ టీ సంస్థ ఎన్డీఎస్‌ఏ నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాంటి సాంకేతిక పరీక్షలు నిర్వహించకుండానే బ్యారేజీల్లో లోపాలున్నాయని చెప్పడాన్ని తాము అంగీకరించమని తేల్చి చెప్పింది. మరోవైపు ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇచ్చినప్పటికీ తరువాత తీసుకోవలసిన చర్యల విషయంలో  జాప్యం ఏర్పడటంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ఇప్పిటికే చాలాకాలంగా బ్యారేజీలను ఖాళీగా ఉంచడం వల్ల భవిష్యత్తులో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో  బ్యారేజీల  విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వెంటనే కార్యాచరణ చేపట్టాలంటూ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ క్రమంలో తాజాగా ఏర్పాటు చేసిన కమిటీ.. కేంద్ర జల సంఘం, పుణెలోని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ సలహాలు తీసుకుని మూడు బ్యారేజీల పునరుద్ధరణపై తమ కార్యాచరణ చేపట్టనుంది.

Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!

కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ఇంకా విచారణను పొడిగించడంతో  మరింత జాప్యం ఏర్పడుతోంది. ఈ క్రమంలో మూడు బ్యారేజీల పునరుద్ధరణ సాధ్యసాధ్యాలపై ఈ కమిటీ ఆధ్యయనం చేయనుంది. దీనికోసం  చేయాల్సిన పరీక్షలు తదితర అంశాలపై సూచనలు అందించనుంది. ఎన్డీఎస్‌ఏ నివేదిక ఆధారంగా ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై నీటిపారుదల శాఖ ఈఎన్సీ కార్యాలయం కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసింది. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాకులోని పియర్స్‌తోపాటు బ్లాక్‌ మొత్తాన్నీ తొలగించాలని నిర్ణయించిన కమిటీ దానికోసం అనుభవం, నైపుణ్యం ఉన్న ఏజెన్సీకి బాధ్యత అప్పగించాలని నిర్ణయించింది. దానివల్ల ఇతర బ్లాకులకు ఎటువంటి ప్రమాదం ఏర్పడకుండా సురక్షిత పద్ధతులు అనుసరించాలని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది.

Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!

మూడు బ్యారేజీలను తిరిగి పునరుద్ధరించాలంటే ఆ బ్యారేజీల్లో ఏర్పడిన పగుళ్లను గుర్తించి వాటిని పూడ్చివేయాలి. దీనివల్ల వాటి పునాదుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణుల కమిటీ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో సాంకేతిక పద్ధతులతో స్ట్రక్చరల్‌ అధ్యయనాలు చేపట్టాల్సి ఉందని తెలిపింది. నదీ ప్రవాహ ప్రభావాన్ని తగిన విధంగా అంచనా వేసి డిజైన్లలో చేర్చాలని తెలిపింది. మేడిగడ్డ ఏడో బ్లాక్‌ను కొత్తగా నిర్మించాల్సి ఉన్నందున స్లాబ్, గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదల చేసినప్పుడు ఉత్పత్తయ్యే శక్తి పీడనాన్ని తట్టుకునేలా డిజైన్లు ఉండేలా ప్రత్యేక అధ్యయనాలు అవసరమని నివేదికలో పేర్కొంది.

Also Read : Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

Also Read :  BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే

Advertisment
Advertisment
తాజా కథనాలు