కాళేశ్వరంలో లోపాలివే | Kaleshwaram Project | RTV
కాళేశ్వరంలో లోపాలివే | Loopholes in Kaleshwaram Project are submitted to Justice P C Ghosh Commission in its construction and Maintenance | RTV
కాళేశ్వరంలో లోపాలివే | Loopholes in Kaleshwaram Project are submitted to Justice P C Ghosh Commission in its construction and Maintenance | RTV
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మార్చి 6న తెలంగాణకు రానుంది. హైదరాబాద్‌లో అధికారులతో భేటీ తర్వాత మార్చి 7, 8న బ్యారేజీలను పరిశీలించనుంది. సమస్యను పరిష్కరించడానికి చర్యలు సూచిస్తుంది.
కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ బండారం బయటపెడతామంటోంది బీఆర్ఎస్. కేటీఆర్ నేతృత్వంలో దాదాపు 150 మంది సీనియర్ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. ఈ విజిట్‌తో వాస్తవాలను ప్రజల ముందుంచుతామని కేటీఆర్ చెబుతున్నారు.
అటు మేడిగడ్డకు రేవంత్.. ఇటు నల్గొండకు కేసీఆర్ వెళ్తుండడంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై బీఆర్ఎస్ టార్గెట్‌గా కాంగ్రెస్ విమర్శలు గుప్పించగా.. లోక్‌సభ ఎన్నికలకు కూడా ఇదే అస్త్రంతో ముందుకువెళ్తోంది.
సీఎం రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు కాసేపట్లో వెళ్లనున్నారు. ఉదయం అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేరుగా బస్సుల్లో బయలుదేరనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మేడిగడ్డకు రేవంత్ రెడ్డి బృందం చేరుకుంటుంది.
ఇరిగేషన్ శాఖ మీద ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. దీంటో ఇటీవల ఇరిగేషన్ శాఖ మీద జరిగిన విజిలెన్స్ దాడులు పై కూడా చర్చించనున్నారు. కాళేశ్వరం నిర్మాణంపై న్యాయ విచారణ, పెండింగ్ పనులపై చర్చ జరగనుందని సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 50 వేల కోట్ల కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డి బొక్కేశారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ప్రతిపక్షంలో ఉండి సీబీఐ విచారణ కోరిన కాంగ్రెస్.. ఇప్పుడెందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ మంత్రులు. ప్రాజెక్టులో దాదాపు రూ. 50 వేల కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదలబోమని స్పష్టం చేశారు. ప్రాజెక్టును కట్టిన వారే బాధ్యులు అని హెచ్చరించారు.