Pawan Kalyan : మీకో దండంరా బాబు.. టాలీవుడ్ పై పవన్ ఫైర్!

తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్‌ గిఫ్ట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చి ఏడాదైనా సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారా అని పవన్‌ ప్రశ్నించారు.

New Update

తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్‌ గిఫ్ట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చి ఏడాదైనా సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారా అని పవన్‌ ప్రశ్నించారు. సినీపెద్దలు, అగ్రనటులను గత ప్రభుత్వం ఎలా చూసిందో మర్చిపోయారా అని పవన్ గుర్తుచేశారు. గత ప్రభుత్వం సినిమా రంగంవారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో మరచిపోయినట్లున్నారని అన్నారు.  ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవన్న పవన్.. సినిమా సంఘాల ప్రతినిధులే రావాలన్నారు. తమ ప్రభుత్వం వ్యక్తులను కాదు.. సినీరంగం అభివృద్ధినే చూస్తుందని తెలిపారు.  

Also Read :   Kodali Nani: ఎట్టకేలకు బయటకు వచ్చిన కొడాలి నాని.. వివాహ వేడుకకు హాజరు.. ఫొటోలు, వీడియోలు వైరల్!

Also Read :   Donald Trump: మరో కంపెనీకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఈ దేశాల్లో తయారు చేస్తే సుంకం తప్పదు

Pawan Kalyan Warning To Tollywood

తెలుగు సినిమా ఇండస్ట్రీ తీరుపై పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. ఆయన నటించిన హరి హర వీరమల్లు రిలీజ్ దగ్గరపడుతున్న వేళ నిర్మాతలతో ఇబ్బందుల వల్ల థియేటర్లు మూసేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయంపై ఆయన మండిపడ్డారు. పరిశ్రమ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుంటే కనీసం కృతజ్ఞత చూపడం లేదంటూ ఫైరయ్యారు.  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించింది. అదే విధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకువస్తామని పవన్ వెల్లడించారు.  దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చి్స్తామని తెలిపారు. అనంతరం కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తారు. 

Also Read :  మీకసలు మానవత్వం ఉందా?: వంశీని చంపేస్తారా?: పేర్ని నాని ఎమోషనల్!

Also Read :   Crime: భార్య చీర కట్టుకొని పురుషులతో డాక్టర్ శృంగారం.. ఆ వీడియోలు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు

 

Andhra Pradesh | Pawan Kalyan | telugu-news | telugu-industry | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు