Cinema News: పవన్‌పై కుట్రతోనే థియేటర్ల మూసివేత.. ఆ నలుగురే ఇదంతా చేస్తున్నారా!?

సినిమా థియేటర్ల మూసివేత అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కుందుల దుర్గేష్ సంచలన కామెంట్స్ చేశారు. పవన్‌పై కుట్రతోనే ఇండస్ట్రీలోని ఓ నలుగురు ఇదంతా చేస్తున్నారన్నారు. 'హరిహర వీరమల్లు' మూవీని దెబ్బతీసేందుకే కుట్ర చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. 

New Update
pawan

AP Minister Kundula Durgesh sensational comments on movie theaters

Cinema News: జూన్ 1నుంచి సినిమా థియేటర్ల మూసివేత అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కుందుల దుర్గేష్ సంచలన కామెంట్స్ చేశారు. పవన్‌పై కుట్రతోనే ఇండస్ట్రీలోని ఓ నలుగురు వ్యక్తులు ఇదంతా చేస్తున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 'హరిహర వీరమల్లు' మూవీని దెబ్బతీసేందకే కుట్ర చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. 

ఈ మేరకు ఒకటో తేదీ నుంచి సినిమా ధియేటర్లను మూసేస్తామని ఎగ్జిబిటర్లు ప్రకటించడంపై మంత్రి దుర్గేష్ విచారణకు ఆదేశించారు. హోంశాఖ కార్యదర్శి విచారణ చేయాలని కోరారు. ఇండస్ట్రీలోని ఓ నలుగురు వ్యక్తులే ఇదంతా చేస్తున్నాని అనుమానం వ్యక్తం చేశారు. పవన్ సినిమా 'హరిహర వీరమల్లు' రిలీజ్ దగ్గర పడుతుండగానే థియేటర్ల సమస్య తెరపైకి తేవడంలో నలుగురు కీలక పాత్ర ఉందని తనకు తెలిసిందని చెప్పారు.  

Also Read: MH:  డ్రగ్స్ ఇచ్చి వైద్య విద్యార్థిపై గ్యాంగ్ రేప్ చేసిన క్లాస్ మేట్స్

'టాలీవుడ్ సినిమా కొందరి చేతుల్లో వ్యాపారంగా మారింది.సినిమా థియేటర్లు ఇప్పుడు ఎగ్జిబిటర్ల చేతుల్లో లేదనేది బహిరంగ రహస్యం. చాలా మంది ఒప్పందాల్లో ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలోని నలుగురు ప్రముఖుల చేతుల్లో వందల థియేటర్లు ఉన్నాయి. ఎవరి గుప్పిట్లో పడకుండా సొంతంగా ధియేటర్లు నడిపించుకునేవారు అతి తక్కువ మంది ఉన్నారు. వారికి సినిమాలు దొరకడం కష్టంగా మారడంతో చాలా మంది తమ థియేటర్లను మాల్స్ గా లేకపోతే ఫంక్షన్ హాల్స్ గా మార్చుకుంటున్నారు. ధియేటర్లపై ఇప్పుడు నలుగురికి గుత్తాధిపత్యం ఉంది. వారే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా. అయినా ధియేటర్లకు రెంటల్స్, షేర్స్ అంటూ పాత వివాదాన్ని కొత్తగా తెరపైకి చ్చి ధియేటర్లు క్లోజ్ చేస్తామంటున్నారు' అని ఆయన చెప్పారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు