ఘోర ప్రమాదం.. ప్రైవేటు బస్సు బోల్తా పడి 25 మంది!
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
BRS నేత వల్లే తన బిడ్డ స్వేచ్ఛ చనిపోయిందని ఆమె పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛ బలవన్మరణానికి బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసిన పూర్ణచందరే కారణమని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం.. తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
మంచిర్యాలలో సంతూర్ సోప్లతో వెళ్తున్న ఒక లారీ ఇంకో లారీని ఢీకొనడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందులోని సబ్బులు రోడ్డు మీద పడటంతో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. బాధితుల కోసం కాకుండా సంతూర్ సబ్బుల కోసం ఎగబడ్డారని కొందరు మండిపడుతున్నారు.
చిన్నారులపై అఘాయిత్యాల పట్ల షీ టీం వారిలో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తోంది. అలా చేసిన ఒక ప్రయత్నంలో ఒక చిన్నారి లైంగికదాడికి గురైన విషయం వెలుగు చూసింది. ఓ పదేళ్ల చిన్నారికి డబ్బు, చాక్లెట్లు ఆశచూపి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహథ్నూర్ కు చెందిన ఒక బాలికకు స్నేహం పేరుతో ఓ మైనర్ బాలుడు దగ్గరయ్యాడు. ఆమెతో న్యూడ్ కాల్ చేయించి దాన్ని రికార్డు చేసి తన స్నేహితులకు షేర్ చేశాడు. దాన్ని అడ్డం పెట్టుకుని వారంతా బాలికను లైంగికంగా వేధించారు. చివరికి కటకటాల పాలయ్యారు.
తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుకునేవారికి రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కూడా పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధన కేంద్రం షార్కు ఈరోజు గుర్తు తెలియని వ్యక్తులు పోన్ చేసి బాంబులు పెట్టినట్లు బెదిరించారు. చెన్నైలోని సీఐఎస్ఎఫ్ కార్యాలయానికి పోన్ చేసి షార్లో బాంబు పెట్టినట్లు దుండగులు వెల్లడించారు.
బాసర దర్శనానికి వెళ్లిన ఐదుగురు యువకులు గోదావరిలో గల్లంతు అయ్యారు. నదిలో స్నానానికి వెళ్లగా కొట్టుకుపోయారు. వారంతా హైదరాబాద్ దిల్సుఖ్నగర్ చెందినవారు. గజఈగాళ్ల సాయంతో నలుగురి మృతదేహాలు బయటకు తీశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.