Hussain Sagar: బోట్ల దగ్ధం ఘటనలో యువకుడు మిస్సింగ్‌

నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా గ్రౌండ్స్‌లో భారతమాత ఫౌండేషన్‌ నిర్వహించిన ‘భరతమాతకు మహా హారతి’ కార్యక్రమంలో అపశ్రుతి దొర్లింది. టపాసులు పేలుస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు బోట్లపై పడి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ యువకుడు మిస్సయ్యాడు.

New Update
Hussain Sagar  Boat Fire

Hussain Sagar Boat Fire

నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా గ్రౌండ్స్‌లో భారతమాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భరతమాతకు మహా హారతి’ కార్యక్రమంలో ఆదివారం రాత్రి అపశ్రుతి చోటు చేసుకున్నా విషయం తెలిసిందే.టపాసులు పేలుస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు తిరిగి అదే బోట్లపై పడ్డాయి. దాంతో బోట్లలో ఉన్న బాణసంచా పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.ఈ ఘటనలో ఓ యువకుడు మిస్సయ్యాడు. నిన్న రాత్రి ఫ్రెండ్స్‌తో బోటులో వచ్చిన అజయ్ అనే యువకుడు కనిపించకుండా పోయాడు. నిన్న రాత్రి ఫ్రెండ్స్‌తో కలిసి బోటులో అజయ్ అనే యువకుడి అచూకీ లభించలేదు. రాత్రి నుంచి అజయ్ ఫోన్ స్విచాఫ్ అని వస్తోంది.

కాగా ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్చించగా అజయ్‌ మాత్రం ఏ హాస్పిటల్‌లోను లేడంటున్న పోలీసులు. దీంతో అజయ్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అజయ్‌తో పాటు ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ క్షేమంగా ఉన్నారు. కానీ బీటేక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అజయ్ మిస్పవడం కలకలం రేపుతోంది.దీంతో అజయ్‌ కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read :  సూర్యాపేటలో పరువు హత్య.. ప్రేమించాడని వెంటపడి.. రాళ్లతో కొట్టి..!

Also Read :  జైళ్ల నుండి తప్పించుకున్న 700 మంది ఖైదీలు... ఎక్కడికి వెళ్లారు?

Hussain Sagar Boat Burning Incident

నిన్న రాత్రి హుస్సేన్ సాగర్ (Hussain Sagar) లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. బాణాసంచా పేలి రెండు బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద సమయంలో బోట్లలో ఏడుగురు ఉన్నారు. వీరిలో ముగ్గురు గాయపడ్డారు. గవర్నర్, కేంద్రమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. హుస్సేన్ సాగర్ లో బాణసంచా ఉన్న బోట్లలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బోట్లలో ప్రయాణికులు ఉన్నారు. అయితే వారంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.

నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా గ్రౌండ్స్‌లో భారతమాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 'భరతమాతకు మహా హారతి' కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత బాణసంచా పేల్చేందుకు తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్‌కు చెందిన రెండు బోట్లలో భారీగా బాణా సంచా సామాగ్రిని హుస్సేన్‌ సాగర్‌ మధ్యలోకి తీసుకెళ్లారు.టపాసులు పేలుస్తున్న సమయంలో నిప్పులు బాణాసంచా నిల్వ చేసిన బోట్లపై పడటంతో.. భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో బోట్లలో ఉన్నవారు నీటిలో దూకారు. రెండు బోట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో రెండు బోట్లలో ఏడుగురు ఉన్నారు. వీరిలో ముగ్గురు గాయపడ్డారు. నలుగురు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  అయితే ఈ ఘటనలో అజయ్‌ అనే యువకుడి మిస్సింగ్‌ మిస్టరీగా మారింది. ఏడేళ్లుగా భరతమాతకు హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read :  మౌని అమావస్య రోజు గంగలో మునిగితే పాపాలు పోతాయా? మహాకుంభమేళకు పోటెత్తుతున్న భక్తులు

Also Read :  ఫిబ్రవరి 5 వరకు అక్కడ పాఠశాలలు బంద్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు