Varanasi: ఫిబ్రవరి 5 వరకు అక్కడ పాఠశాలలు బంద్

ఉత్తరప్రదేశ్ మహా కుంభమేళాకు వెళ్తున్న భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో కొందరు భక్తులు వారణాసి కూడా వెళ్తుండటంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. దీంతో వారణాసి మేజిస్ట్రేట్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు నేటి నుంచి ఫిబ్రవరి 5 వరకు సెలవులు ప్రకటించింది.

New Update
Schools: ఆ రాష్ట్రంలో 1600 స్కూళ్ల మూసివేత‌..

Varanasi

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు మహా కుంభమేళానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కొందరు వారణాసి వెళ్లడంతో భక్తలు రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. దీనివల్ల విద్యార్థులకు ఇబ్బంది ఏర్పడంతో అక్కడ ప్రభుత్వం పాఠశాలలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 

ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్‌ ఈటర్‌ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!

ఇది కూడా చూడండి:  Donald Trump: ఇజ్రాయెల్‌ కి మళ్లీ బాంబులు..బైడెన్‌ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!

జిల్లాలోని అన్ని పాఠశాలలకు..

వారణాసి జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలను నేటి నుంచి ఫిబ్రవరి 5 వరకు మూసివేయాలని మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. అయితే విద్యార్థులకు చదువు విషయంలో ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండటానికి అన్ని పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. 

ఇది కూడా చూడండి:UCC: ఉత్తరాఖండ్‌ లో ఉమ్మడి పౌరస్మృతి..ఎప్పటి నుంచి అమలు అంటే

ఇదిలా ఉండగా గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కుంభమేళా శకటాలను ప్రదర్శించారు. ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న పవిత్ర సంగమం గురించి అందరి కళ్లకు తెలియజేసేలా ఈ శకటాలను ప్రదర్శించారు. ముందుకి అమృత కలశం కనిపించేలా పెట్టారు. ఇది కూడా వంగి ఉండి అమృత ధార ప్రవాహాన్ని సూచించేలా శకటం పెట్టారు. దీని చుట్టూ సాధువులు, కొందరు డ్యాన్స్ సంప్రదాయమైన డ్యాన్స్ వేస్తున్నట్లు తెలిపారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు