Suryapet Incident: సూర్యాపేట జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. మామిళ్ళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జనగామ రహదారి నుంచి పిల్లలమర్రికి వెళ్లే కెనాల్ కట్టపై పై కృష్ణ మృతదేహం లభ్యమైంది. బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే ప్రేమవివాహమే ఈ హత్యకు దారితీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?
పరువు హత్య..
కృష్ణ ఆరునెలల క్రితం కృష్ణ భార్గవి అనే అమ్మాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. అయితే చెల్లెలు భార్గవి కులాంతర వివాహం చేసుకోవడం ఆమె అన్నకు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో భార్గవి సోదరుడు కృష్ణ పై కోపంతో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలోనే కృష్ణ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. మరోవైపు పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న కృష్ణ హఠాత్తుగా హత్యకు గురికావడం మరో అనుమానానికి తెరలేపింది. దీంతో కృష్ణది పరువు హత్యనా? లేదా పాత కక్షలే కారణమా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read: Balayya Padma Bhushan: జై బాలయ్య.. పద్మ భూషణ్ వేళ అభిమానికి బాలయ్య ఫోన్ కాల్ .. పోస్ట్ వైరల్