/rtv/media/media_files/2025/10/11/fotojet-34-2025-10-11-20-06-04.jpg)
A Man arrested in Nalgonda for 50-crore high-interest scam
నల్గొండ(nalgonda) జిల్లాలో ఓ వ్యక్తి అధిక వడ్డీ(High Interest) పేరుతో రూ.50 కోట్ల మోసానికి తెరలేపాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు విలువైన కార్లు, 7 మొబైల్ ఫోన్లు, ప్రామిసరీ నోట్లు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసలు తెలిపిన వివరాల ప్రకారం.. పీఏపల్లి మండలం, వద్దిపట్ల గ్రామానికి చెందిన రమావత్ బాలాజీ అనే వ్యక్తి 2020లో ఓ ఐస్‌క్రీమ్ పార్లర్ బిజినెస్ మొదలుపెడతానని తన బంధువులకు చెప్పాడు. వాళ్ల నుంచి రూ.2 చొప్పున వడ్డీకి రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. వ్యాపారంలో అతడికి నష్టం వచ్చింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నాడు.
Also Read: 3 వేల ఉద్యోగాలకు TGPSC నోటిఫికేషన్.. నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!
A Man Arrested Over High Interest Rate
ఇందుకోసం రూ.6 వడ్డీకి అదే గ్రామానికి చెందిన వాళ్ల నుంచి రూ.15 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. క్రమంగా వడ్డీ చెల్లిస్తూ వాళ్లకి నమ్మకం చెల్లించాడు. అలాగే అతడు మరికొంత మంది ఏజెంట్లను నియమించుకుని చుట్టుపక్కల ఉన్న గిరిజన తండాల్లో కూడా అధిక వడ్డీకి అప్పులు తీసుకున్నాడు. వచ్చిన డబ్బులతో బంధువులు, స్నేహితుల పేరుమీద ఇళ్లు, వ్యవసాయ భూములు, ఖరీదైన కార్లు, బైక్‌లు కొని జల్సా చేసేవాడు.
Also Read: మరో బాణాసంచా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మంటల్లో!
అంతేకాదు ఇంకా అధిక డబ్బుల కోసం అప్పిచ్చేవాళ్లకు రూ.10 వడ్డీ ఇస్తానని చెప్పి రూ.కోట్లల్లో డబ్బులు వసూలు చేశాడు. వడ్డీ మాత్రమే ఇచ్చి బాధితుల వద్ద ఉండే ప్రామిసరీ నోటు వెనకు వడ్డి ఇచ్చినట్లు రాసేవాడు. అయితే బ్యాంకులో వచ్చే వడ్డీ కంటే బాలాజీ ఎక్కువ వడ్డీ ఇవ్వడంతో జనాలు అతడికి అలవాటు పడ్డారు. అధిక డబ్బులకు ఆశపడి పెద్దమొత్తంలో డబ్బులు ఇచ్చారు. అయితే గత కొన్ని నెలల నుంచి బాలాజీ బాధితులకు అసలు, వడ్డీ డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో బాధితులు అతడిపై ఒత్తిడి చేయగా వాళ్ల నుంచి తప్పించుకొని పారిపోయాడు. చివరికి పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
Also Read: విద్యార్థికి ఘోర అవమానం.. ఫీజు చెల్లించలేదని నేలపై కూర్చోబెట్టి పరీక్షలు