School: విద్యార్థికి ఘోర అవమానం.. ఫీజు చెల్లించలేదని నేలపై కూర్చోబెట్టి పరీక్షలు

మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ విద్యార్థికి ఘోరమైన అవమానం జరిగింది. ఆ విద్యార్థి స్కూల్ ఫీజు చెల్లించలేదని బలవంతంగా నేలపై కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. చివరికి విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్కూల్‌ హెడ్‌మాస్టర్‌తో పాటు టీచర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
Student Made To Sit On Floor Over Unpaid Fees. Case Filed Against Headmistress

Student Made To Sit On Floor Over Unpaid Fees. Case Filed Against Headmistress

మహారాష్ట్ర(maharashtra) లోని థానే జిల్లాలో ఓ విద్యార్థికి(student) ఘోరమైన అవమానం(insult) జరిగింది. ఆ విద్యార్థి స్కూల్ ఫీజు చెల్లించలేదని బలవంతంగా నేలపై కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. చివరికి విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్కూల్‌ హెడ్‌మాస్టర్‌తో పాటు టీచర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని భివాండిలో ఓ ఉర్దూ మీడియం పాఠశాల ఉంది. అందులో 14 ఏళ్ల విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి ఆటో డ్రైవర్‌. అయితే అక్టోబర్ 3, 4 తేదీల్లో పదవ తరగతి విద్యార్థులకు యూనిట్‌ పరీక్షలు జరిగాయి.

Also Read: మరో బాణాసంచా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మంటల్లో!

Student Made To Sit On Floor Over Unpaid Fees

ఆ బాలుడు స్కూల్‌ ఫీజు చెల్లించకపోవడం వల్ల అతడిని తరగతి గదిలోని నేలపై కూర్చోబెట్టి పరీక్షలు రాయించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన బాలుడు జరిగిన విషయాన్ని తండ్రికి తెలియజేశాడు. ఆయన స్కూల్‌ యజమాన్యానికి దీని గురించి పలుమార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి అతడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

Also Read: ఇదిరా కంపెనీ అంటే.. ఉద్యోగులకు 9 రోజులు దీపావళి సెలవులు

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాల  ప్రధానోపాధ్యాయురాలు ఖాన్ అతిహా, ఉపాధ్యాయుడు అహ్మదుల్లాపై కేసు నమోదు చేశారు. స్కూల్‌ సిబ్బంది, సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై అక్కడి స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ ఫీజు చెల్లనించ మాత్రానా ఆ విద్యార్థిని ఇలా ఘోరంగా అవమానించడం సరికాదంటూ హితువు పలుకుతున్నారు. ఇలాంటి చర్యలు మరోసారి ఎక్కడా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే ఈ స్కూల్‌ సిబ్బందిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: వెస్ట్ బెంగాల్ లో మరో దారుణం.. MBBS స్టూడెంట్ పై రేప్.. ఫోన్ లాక్కుని

Advertisment
తాజా కథనాలు