/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/tiger-jpg.webp)
tiger
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. భీంపూర్ మండలం తాంసి శివారులో అర్థరాత్రి ఒక్కసారిగా పెద్ద పులి కనిపించింది. పిప్పల్‌కోటి ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఓ లారీ డ్రైవర్ అర్థరాత్రి సమయంలో రోడ్డు దాటుతుండగా.. పులి కనిపించింది. అతను వాహనాన్ని ఆపి వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చూడండి: Stock Market Today: లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర
#tiger crossing village road triggers panic among locals in #Adilabadhttps://t.co/6UDkUBX1NA
— Telangana Today (@TelanganaToday) January 22, 2025
ఇది కూడా చూడండి:OTT Movies: ఓటీటీలో మిలియన్ల జనం చూసిన సీరీస్ లు, సినిమాలు ఇవే.. మరి మీరు చూశారా?
జన సంచారం ఉన్న దగ్గరకు రాదని..
ఈ విషయాన్ని అతను అటవీశాఖ సిబ్బందికి తెలపగా.. బేస్ క్యాంపు బృందాలను రంగంలోకి దించాయి. అక్కడున్న ప్రాంతాలను పరిశీలించారు. రెండేళ్ల వయస్సు ఉన్న పులి మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పెన్ గంగ నది వైపు వెళ్లినట్లు తెలిపారు. అయితే జన సంచారం ఉన్న దగ్గరకు పులి రాలేదని, రాదని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగ ఉండాలని తెలిపారు. అలాగే పులి సంచరించిన ప్రాంతల్లో సీసీ కెమెరాలు కూడా బిగించారు.
ఇది కూడా చూడండి:BREAKING: సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!
ఇది కూడా చూడండి: భట్టి vs ఉత్తమ్ .. రేషన్ కార్డుల జారీపై మంత్రులు తలో మాట!
ఇది కూడా చూడండి: సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!