/rtv/media/media_files/2025/01/11/dTcpZX6QUHm3wQziBrR5.jpg)
IT raids in director Sukumar house
Hyderabad: స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని నివాసంలో బుధవారం తెల్లవారు జామున ఐటీ అధికారులు దాడులు చేశారు. పుష్ప-2 సినిమా భారీ కలెక్షన్ల నేపథ్యంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్!
— RTV (@RTVnewsnetwork) January 22, 2025
పుష్ప సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్..ఇప్పటికే నిర్మాణ సంస్థ మైత్రీ కార్యాలయాల్లోనూ సోదాలు.@SukumarWritings #hyderabad #director #sukumar #itraids #RTV pic.twitter.com/DNJ3wclktN
నిర్మాతల ఇళ్లలోనూ..
మేకర్స్ ఇళ్లపై నిన్నటి నుంచి రైడ్స్ చేస్తున్న విషయం తెలిసింది. కాగా ఈ క్రమంలోనే డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ రైడ్స్ చేశారు. మరోవైపు దిల్ రాజు ఇల్లు, కార్యాలయంలోనూ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఎస్‌వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేస్తున్నారు. సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై అధికారులు ఆరాలు తీస్తున్నారు. పుష్ప-2 బడ్జెట్, వచ్చిన ఆదాయంపై లెక్కలు అడుగుతున్నారు. ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతోనే ఈ సోదాలు చేస్తున్నారని తెలుస్తోంది. నిన్న దిల్ రాజు భార్య తేజస్వినితో బ్యాంకు లాకర్లు తెరిపించిన అధికారులు.. ఈరోజు మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనున్నారని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో అలిపిరి దాడి సూత్రధారి మృతి
ఎస్‌వీసీ ఆఫీస్‌కు దిల్ రాజు (Dil Raju) ను తీసుకెళ్లే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. నిన్న కూడా సాయంత్రం వరకూ ఫుల్ తనిఖీలు చేశారు. దిల్ రాజు కార్యాలయంతో పాటు జూబ్లీహిల్స్ ఉజాస్ విల్లాస్‌లోని ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు. అలాగే రాజు కుమార్తె హన్సితారెడ్డి, సోదరుడు నర్సింహారెడ్డి.., శిరీష్ ఇళ్లల్లోనూ ఐటీ బృందాలు గాలింపు చేస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్వాహకులు నవీన్, రవిశంకర్‌లతో పాటు సీఈవో చెర్రీ ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.