Mohammed Shami ex wife: టీమిండియా క్రికెటర్ షమీ మాజీ భార్య, కూతురిపై క్రిమినల్ కేసు - షాకింగ్ వీడియో

భారత క్రికెటర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహా, కుమార్తె అర్షి జహాపై హత్యాయత్నం కేసు నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లోని సూరిలో ఆస్తి వివాదం కారణంగా దలియా ఖాతూన్‌పై దాడి చేశారని ఫిర్యాదు నమోదైంది. దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

New Update
Case registered against Indian cricketer Mohammed Shami ex-wife and daughter

Case registered against Indian cricketer Mohammed Shami ex-wife and daughter

భారత క్రికెటర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహా, ఆమె కుమార్తె అర్షి జహాకు బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. హసీన్, అర్షిపై హత్యాయత్నం (Attempt to Murder) కేసు నమోదైనట్లు సమాచారం. ఆస్తి వివాదం విషయంలో వీరిద్దరూ దలియా ఖాతూన్‌ అనే మహిళపై  దాడి చేశారని పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలోని సూరి పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదుతో హసీన్ జహా, అర్షి జహాపై BNS లోని 126(2), 115(2), 117(2), 109, 351(3), 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఈ సెక్షన్లలో హత్యాయత్నంతో పాటు దాడి, ఇతర ఆరోపణలు కూడా ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఆస్తి వివాదం

పశ్చిమ బెంగాల్‌లోని సూరి పట్టణంలోని వార్డ్ నంబర్ 5లో హసీన్ జహా, అర్షి జహా నివాసం ఉంటున్నారు. ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో వారు ఇటీవల నిర్మాణం మొదలుపెట్టారు. దలియా ఖాతూన్ ఈ నిర్మాణం ఆపడానికి ప్రయత్నించగా.. ఆమెపై హసీన్, అర్షి దాడికి దిగినట్లు తెలుస్తోంది. 

ఓవైపు ఈ స్థలం తమదని హసీన్ జహా అంటుంటే.. మరోవైపు ఆ స్థలం తమదని దలియా ఖాతూన్‌ ముందుకు రావడంతో ఇరువురి మధ్య వాగ్వాదం మొదలవడంతో ఈ దాడి జరిగినట్లు సమాచారం. దీని అనంతరం హసీన్ జహా, అర్షి జహాలు తనపై దాడి చేశారని దలియా ఖాతూన్ సూరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

కాగా ఇటీవలే కలకత్తా హైకోర్టు మహ్మద్ షమీ తన మాజీ భార్య హసీన్ జహాకు నెలకు రూ.1.5 లక్షలు, కుమార్తె అర్షికి నెలకు రూ.2.5 లక్షలు కలిపి మొత్తం రూ.4 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ కేసు నమోదు కావడం గమనార్హం. 

Advertisment
Advertisment
తాజా కథనాలు