Andhra King Taluka: రామ్ పోతినేని- భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'ఆంధ్రాకింగ్ తాలూకా ' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. 'నువ్వుంటే చాలే'.. అంటూ రొమాంటిక్ మెలోడీగా సాగిన పాట వినసొంపుగా ఉంది. అనిరుధ్ రవిచంద్రన్ వాయిస్ ఎంతో రిఫ్రెషింగ్ గా ఉంది. వివేక్, మెర్విన్ సంగీతం హీరో రామ్ స్వయంగా లిరిక్స్ రాశాడు. ఈ పాటతో రామ్ తనలోని రైటర్ ని పరిచయం చేశాడు.
& #NuvvunteChaley is out!
— RAm POthineni (@ramsayz) July 18, 2025
A special song in my career indeed!
Excited to share it with you all! ❤️
Our @iamviveksiva & @mervinjsolomon ‘s journey in TFI begins 🤗
Thank you Rockstar @anirudhofficial
Dedicating this to all my ❤️🔥s!
▶️ https://t.co/Xn76mnbt2Bpic.twitter.com/YWxfTF2HJO
చివరి షెడ్యూల్
మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇందులో రామ్ కన్నడ హీరో ఉపేంద్ర అభిమానిగా కనిపించబోతున్నాడు. హీరో రామ్ ప్రస్తుతం ఒక్క మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన నటించిన గత మూడు చిత్రాలు స్కంద, వారియర్, డబుల్ ఇస్మార్ట్ బాక్స్ వద్ద నిరాశపరిచాయి. దీంతో 'ఆంధ్రాకింగ్' రామ్ కి కీలకం కాబోతుంది.
ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన గ్లిమ్స్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ వింటేజ్ రామ్ ని ఈ సినిమాలో చూడబోతున్నట్లుగా అనిపించింది. ఎనర్జిటిక్ వైబ్స్ తో రామ్ క్యారెక్టర్ యూత్ ఫుల్ గా కనిపించింది. ఉపేంద్ర అభిమానిగా రామ్ డైలాగ్స్, సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
Also Read: Sakshi Malik: బికినీలో సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. ఫొటోలు వైరల్!