/rtv/media/media_files/2025/07/17/allu-arjun-vcation-with-family-2025-07-17-13-22-30.jpg)
allu arjun vcation with family
Allu Arjun: పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'పుష్ప' తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం తన బిజీ షెడ్యూల్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న బన్నీ ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి అమెరికాలోని యూనివర్సల్ స్టూడియోస్ ని సందర్శించారు. అక్కడ పిల్లలతో ఖ్వాలిటీ సమయాన్ని గడుపుతున్నారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/07/17/allu-arjun-with-kids-2025-07-17-13-46-36.jpg)
అల్లు అర్జున్ ఫ్యామిలీ టైం
ఇందుకు సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్, తన భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి ఉన్న పిక్ షేర్ చేయడంతో అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు. 'హార్ట్' ఎమోజీస్ తో కామెంట్ సెక్షన్ నింపేశారు. ''స్వీట్ ఫ్యామిలీ'', ''హ్యాపీ ఫ్యామిలీ'' అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫొటోలో ఫ్యామిలీ అంతా బ్లాక్ డ్రెస్ ధరించి పర్ఫెక్ట్ ఫ్యామిలీ పోట్రైట్ లా ఉంది.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ - అట్లీ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 'AA22 x A6' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. దాదాపు రూ. 800 కోట్లు ఈ ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
ఇందులో అల్లు అర్జున్ ఇప్పటివరకు కనిపించిన డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు టాక్. దీంతో పాటు బన్నీ నాలుగు పాత్రల్లో కనిపించబోతున్నారనే వార్త మరింత ఆసక్తిని పెంచుతోంది. బాలీవుడ్ నటి దీపికా పడుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు