EVMలలో ఇకనుంచి కలర్‌ ఫొటోలు.. ఈసీ కీలక ప్రకటన

కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. EVMలలో ఉండే బ్యాలెట్‌ పేపర్లలో అభ్యర్థలు కలర్‌ ఫొటోలు ఉంచుతామని పేర్కొంది. అలాగే బిహార్‌లో నవంబర్ 22 లోగా అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేస్తామని తెలిపింది.

New Update
Bihar To Be First State With Coloured EVM Ballots, Candidate Photos, Polls Before Nov 22

Bihar To Be First State With Coloured EVM Ballots, Candidate Photos, Polls Before Nov 22

కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. EVMలలో ఉండే బ్యాలెట్‌ పేపర్లలో అభ్యర్థలు కలర్‌ ఫొటోలు ఉంచుతామని పేర్కొంది. అలాగే బిహార్‌లో నవంబర్ 22 లోగా అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేస్తామని తెలిపింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం రెండ్రోజుల పాటు పర్యటించింది. దీనికి సంబంధించిన వివరాలను పట్నాలో జరిగిన మీడియా సమావేశంలో వివరించింది. పుట్టిన తేదీ, పౌరసత్వానికి ఆధార్ కార్డు ధ్రువీకరణ కాదని మరోసారి స్పష్టం చేసింది. అంతేకాదు చట్టానికి లోబడే ఆధార్‌కార్డును వినియోగిస్తున్నట్లు పేర్కొంది. 

Also Read: ఇన్సూరెన్స్ డబ్బులకోసం దారుణం..వ్యక్తిని చంపి భార్యగా నమ్మించి...ట్విస్ట్ ఏంటంటే?

సీఈసీ జ్ఞనేశ్ కుమార్ మాట్లాడుతూ.. '' బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 1200 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉంటుంది. ఇప్పటికే బూత్‌ స్థాయి అధికారులకు ట్రైనింగ్ ఇచ్చాం. ఎన్ని దశల్లో ఎలక్షన్స్ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నాం. EVMలలో ఉండే బ్యాలెట్‌ పేపర్లో ఇకనుంచి కలర్‌ ఫొటోలు అందుబాటులోకి తీసుకురానున్నాం. దీనివల్ల అభ్యర్థులకు ఓటర్లను తేలికగా గుర్తు పట్టేందుకు వీలు ఉంటుంది. SIR ద్వారా అనర్హులను లిస్టు నుంచి తొలగించాం. వీటిపై అభ్యంతరాలు తెలిపేందుకు రాజకీయ పార్టీలకు అవకాశం ఉందని'' పేర్కొన్నారు. 

Also Read: బలగాల ఉపసంహరణకు ఇజ్రాయిల్ అంగీకారం.. హమాస్ ముందుకొస్తే కాల్పుల విరమణ!

ఇదిలాఉండగా బిహార్‌లో అసెంబ్లీ గడవు నవంబర్ 22తో ముగిసిపోనుంది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం ఏర్పాట్లను సమీక్షించింది. ఈ గడువులోగా పూర్తి చేస్తామని పేర్కొంది. ఒకటి, రెండు దశల్లో వీటిని పూర్తి చేయాలనే అభ్యర్థనలు వచ్చాయని.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక బిహార్‌లో 2020 అసెంబ్లీ ఎన్నికలకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. 2015 ఎన్నికల్లో అయిదు విడుతల్లో పోలింగ్ జరిగింది. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఇటీవల ఈసీ పేర్కొంది. 

Also Read: పక్కా ప్లాన్ తోనే కరూర్ తొక్కిసలాట.. విజయ్ ర్యాలీపై ఖుష్బూ సంచలన ఆరోపణలు!

Advertisment
తాజా కథనాలు