Netflix boycott Elon Musk : నెట్‌ఫ్లిక్స్‌ను బాయ్‌కాట్ చేయాలన్న ఎలాన్ మస్క్..మార్కెట్ విలువ పతనం

నెట్‌ఫ్లిక్స్‌ను బాయ్‌కాట్ చేయాలన్న ఎలాన్ మస్క్ పిలుపుతో ఆ సంస్థపై భారీ ప్రభావం పడింది. నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ విలువ ఏకంగా 15 బిలియన్ డాలర్ల మేరకు తగ్గింది. కేవలం రోజున్నర వ్యవధిలో కంపెనీ షేర్ల ధర 4.3 శాతం మేర పడిపోయింది.

New Update
Elon Musk

Elon Musk

Netflix boycott Elon Musk : నెట్‌ఫ్లిక్స్‌ను బాయ్‌కాట్ చేయాలన్న ఎలాన్ మస్క్ పిలుపుతో ఆ సంస్థపై భారీ ప్రభావం పడింది. నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ విలువ ఏకంగా 15 బిలియన్ డాలర్ల మేరకు తగ్గింది. కేవలం రోజున్నర వ్యవధిలో కంపెనీ షేర్ల ధర 4.3 శాతం మేర పడిపోయింది. ఏప్రిల్ తరువాత ఈ స్థాయిలో షేరు ధర పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే పిల్లల భద్రత కోసం నెట్‌ఫ్లిక్స్‌ను బాయ్‌కాట్ చేయాలని మస్క్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లో డెడ్ ఎండ్ పారానార్మల్ పార్క్ అనే షోపై ఆయన ఆగ్రహంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ  షోలో ఓ టీనేజర్‌ను ట్రాన్స్‌జెండర్‌గా చూపించడంపై మస్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఇప్పటికే తన సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకున్నట్టు ఆయన స్పష్టం చేశారు. పిల్లలను తప్పుదోవ పట్టించేదిగా ఉన్న ఈ షో విషయంలో నెట్‌ఫ్లిక్స్‌‌ను బాయ్‌కాట్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో, నెట్టింట క్యాన్సిల్ నెట్‌‌ఫ్లిక్స్ ట్రెండ్ మొదలైంది. జనాలు తమ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకున్నామంటూ స్క్రీన్ షాట్స్‌ను పోస్టు చేస్తున్నారు. దీంతో, స్వల్ప వ్యవధిలోనే సంస్థ షేరు విలువ ఏకంగా 2 శాతం మేర పతనమైనట్లు తెలుస్తోంది.

 
నిజానికి ఈ షో 2023లోనే నిలిచిపోయింది. అయితే, అందులోని కొన్ని క్లిప్స్ మాత్రం ఇటీవల మళ్లీ వైరల్ అయ్యాయి. ఇలాంటి షోలకు ట్రాన్స్‌జెండర్ వోక్ ఎంజెడానే కారణమని జనాలు దుమ్మెత్తి పోస్తున్నారు.మస్క్‌ కూడా ఈ పోస్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. మరోవైపు, ఈ షో రూపకర్త హామిష్ స్టీల్‌పై జనాలు సీరియస్ అవుతున్నారు. ఇటీవల హత్యకు గురైన చార్లీ కర్క్‌ ఓ నాజీ అంటూ ఆయన పేర్కొనడంపై జనాలు తీవ్రంగా మండిపడ్డారు. ట్రాన్స్‌జెండర్ అయిన హామిష్ తమ వామపక్ష, వోక్ ఎజెండాను ముందుకు తోస్తున్నారని అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఈ క్రమంలో జనాగ్రహం నెట్‌ఫ్లిక్స్ వైపు మళ్లింది. అయితే, ఈ వివాదంపై నెట్‌ఫ్లిక్స్ ఇప్పటివరకూ స్పందించకపోవడం గమనార్హం. అయితే, గతంలోనూ సంస్థ ఇలాంటి కాంట్రవర్సీలను ఎదుర్కొంది.

ఈ క్రమంలోనే టెస్లా , స్పేస్‌ఎక్స్‌ల సీఈఓ ఎలాన్ మస్క్, తన నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోవడమే కాకుండా, తన 1.9 బిలియన్ ఫాలోవర్లను కూడా అలాగే చేయమని పిలుపునిచ్చాడు. "పిల్లల ఆరోగ్యం కోసం నెట్‌ఫ్లిక్స్‌ను రద్దు చేయండి" అని X  లో పోస్ట్ చేసిన మస్క్ పోస్ట్‌లు  వైరల్ అయ్యాయి. ఈ క్యాంపెయిన్, ట్రాన్స్‌జెండర్ థీమ్‌లతో కూడిన పిల్లల కార్టూన్ షోలు, డైవర్సిటీ రిపోర్ట్‌లో 'వైట్ డిస్‌క్రిమినేషన్' వంటి విషయాలపై ఆధారపడి ఉంది. #CancelNetflix హ్యాష్‌ట్యాగ్ Xలో ట్రెండింగ్‌గా మారింది. ఈ కారణంగా నెట్‌ఫ్లిక్స్ షేర్లు దారుణంగా పడిపోయాయి.మస్క్  ఉద్యమానికి కన్జర్వేటివ్ వర్గాల నుంచి మద్దతు లభించింది. 

Also Read :  Los Angeles: పార్సల్ డెలివరీల్లో కొత్త ట్రెండ్.. నేరుగా ఆకాశం నుంచే అందుకోవచ్చు!

Advertisment
తాజా కథనాలు