/rtv/media/media_files/2025/01/28/Nq8h9JRMLpqmGHLjDn98.webp)
Road Accident
Road Accident: రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం కాచివాని సింగారం గ్రామానికి చెందిన మోతీరాం కుమారుడు తేజ చౌదరి (14) నారపల్లి దివ్య నగర్ లోని నల్ల మల్లారెడ్డి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం తన స్కూటీపై పర్వతాపూర్ స్పాంజిల్లా గ్రేడ్ కమ్యూనిటీ కాలనీలో ట్యూషన్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు.
Also Read: OTT Movies: మూవీ లవర్స్ కి పండగ.. ఈ వారం ఓటీటీలో బోలెడు సినిమాలు.. లిస్ట్ ఇదే!
Also Read: Arunachal Pradeh: వాటర్ బాంబ్ కు ధీటుగా..చైనా సరిహద్దుల్లో బ్రహ్మపుత్రపై భారీ రిజర్వాయర్
టిప్పర్ ముందు టైర్ కింద పడి...
ఇదే క్రమంలో పర్వాపూర్ సమీపంలో ముందు వెళ్తున్న టిప్పర్ వాహనం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. దీంతో పక్క నుంచి వస్తున్న తేజ టిప్పర్‌ని ఢీ కొట్టాడు ఈ ప్రమాదంలో ముందు టైర్ కింద పడి తేజ అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తేజ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Also Read: Bengaluru: ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడితో పాటూ మరో 17మందిపై ఎస్టీ అట్రాసిటీ కేసు
Also Read: గూగుల్ మ్యాప్స్‌లో మారిన గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు..కానీ అక్కడ మాత్రం!